న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: పంజాబ్‌ విరాళం రూ. 25 లక్షలు

KXIP donate Rs 25 lakh to families of five CRPF soldiers killed in Pulwama attack

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ ఉగ్రదాడిలో వీరమరణం పొంది 40 మంది జవాన్లలో పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు జవాన్లు ఉన్నారు. ఈ ఐదు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 25 లక్షలను విరాళంగా అందజేసింది. ఈ చెక్కులను ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు జైమాల్‌ సింగ్‌, సుఖిజిందర్‌ సింగ్‌, మహిందర్‌ సింగ్‌, కుల్విందర్‌ సింగ్‌, తిలక్‌ రాజుల కుటుంబాలకు పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌, సీఆర్పీఎఫ్‌ డీఐజీ వీకే కౌందాల్‌లు అందజేశారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అశ్విన్‌ కెప్టెన్సీలో బరిలోకి

గతేడాది అశ్విన్‌ కెప్టెన్సీలో పంజాబ్ జట్టు బరిలోకి దిగింది. తొలి తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించి, ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవడంతో లీగ్‌ దశకే పరిమితమైంది. దీంతో ఈసారి సత్తా చాటాలని భావిస్తోంది. మార్చి 23న సీఎస్కే-ఆర్సీబీ మ్యాచ్‌తో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2019 సీజన్‌లో పంజాబ్‌ తన తొలి మ్యాచ్‌ను మార్చి 25న రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది.

ఐపీఎల్‌లో పంజాబ్ ఆడే మ్యాచ్ వివరాలివే!

March 25: vs RR (8 pm)

March 27: vs KKR (8 pm)

March 30: vs MI (4 pm)

April 1: vs DC (8 pm)

April 6: vs CSK (4 pm)

April 8: vs SRH (8 pm)

April 10: vs MI (8 pm)

April 13: vs RCB (8 pm)

April 16: vs RR (8 pm)

April 20: vs DC (8 pm)

April 24: vs RCB (8 pm)

April 29: vs SRH (8 pm)

May 3: vs KKR (8 pm)

May 5: vs CSK (4 pm)

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, ఆండ్రూ టై, మయాంక్ అగర్వాల్, అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్ ఉర్ రహ్మాన్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, రవిచంద్రన్ అశ్విన్, మన్‌దీప్ సింగ్

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: మార్కస్ హెన్రిక్యూస్‌ (రూ.1 కోటి), నికోలస్ పూరాన్‌ (రూ.4.2 కోట్లు), మహ్మద్ షమీ (రూ.4.8 కోట్లు), సర్ఫరాజ్ ఖాన్‌ (రూ.25 లక్షలు), వరుణ్ చక్రవర్తి (రూ.8.40 కోట్లు), సామ్ కర్రాన్‌ (రూ.7.20 కోట్లు), హర్డస్ విల్జోయెన్‌ (రూ.75 లక్షలు), అర్షదీప్ సింగ్‌ (రూ.20 లక్షలు), దర్శన్ నాల్కండే (రూ.30 లక్షలు), ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ (రూ.4.8 కోట్లు), అగ్నివేశ్ అయాచీ (రూ. 20 లక్షలు), హర్‌ప్రీత్ బ్రార్‌ (రూ. 20 లక్షలు), మురుగన్ అశ్విన్‌ (రూ. 20 లక్షలు).

Story first published: Wednesday, March 20, 2019, 15:50 [IST]
Other articles published on Mar 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X