న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3-0తో సిరిస్ క్లీన్ స్వీప్: లంక విజయోత్సవ సంబరాల్లో అపశృతి

హైదరాబాద్: శ్రీలంక క్రికెటర్ల విజయోత్సవ సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన శ్రీలంక... బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరిస్‌లో అద్భుతంగా పుంచుకుంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

దేశ రక్షణలో నిమగ్నమైన ధోనీ.. విక్టర్‌ ఫోర్స్‌లో విధులుదేశ రక్షణలో నిమగ్నమైన ధోనీ.. విక్టర్‌ ఫోర్స్‌లో విధులు

తొలి వన్డేలో 91 పరుగుల తేడాతో విజయం సాధించిన శ్రీలంక, రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మూడో వన్డేలో ఏకంగా 122 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగేళ్ల తర్వాత వన్డే సిరిస్‌ను కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌మెన్లలో కరుణరత్నే(46), కుశాల్ పెరీరా(42) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో షఫీల్ ఇస్లాం, సౌమ్య సర్కార్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

ప్రారంభమైన యాషెస్ సిరిస్: ఎప్పుడు, ఎక్కడ, ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి!ప్రారంభమైన యాషెస్ సిరిస్: ఎప్పుడు, ఎక్కడ, ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి!

83 పరుగులకే ఐదు వికెట్లు

83 పరుగులకే ఐదు వికెట్లు

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 9వ స్థానంలో క్రీజులోకి వచ్చిన తైజుల్ ఇష్లాం 39 పరుగులతో నాటౌట్‌గా రాణించడంతో 36 ఓవర్లకు గాను 172 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో దాసన్ షణక మూడు వికెట్లు పడగొట్టాడు.

కుశాల్ మెండిస్ అద్భుత ప్రదర్శన

కుశాల్ మెండిస్ అద్భుత ప్రదర్శన

ఈ సిరీస్‌లో కుశాల్ మెండిస్ అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగేళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన సందర్భంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. కుశాల్ మెండిస్ బైక్‌పై జట్టులోని సహచర ఆటగాడిని ఎక్కించుకుని స్టేడియంలో చక్కర్లు కొట్టాడు.

బైక్ అదుపు తప్పి స్కిడ్ అయింది

బైక్ అదుపు తప్పి స్కిడ్ అయింది

ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి స్కిడ్ అయింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కిందపడిపోయారు. పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది, జట్టు సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని బైక్‌ను పైకి లేపారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, మూడో వన్డే విజయాన్ని శ్రీలంక నువాన్ కులశేఖరకు అంకితం చేసింది. కాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేతో శ్రీలంక వెటరన్ పేసర్ లసిత్ మలింగ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, August 1, 2019, 18:09 [IST]
Other articles published on Aug 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X