న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs PBKS: అతడు లేకపోవడం మాకు పెద్ద ఎదురుదెబ్బే: సంగక్కర

Kumar Sangakkara says Missing Jofra Archer big blow for Rajasthan Royals
#IPL2021 : Jofra Archer’s Absence Big Blow For Rajasthan Royals - Kumar Sangakkara | Oneindia Telugu

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా ఈరోజు రాత్రి రాజస్తాన్‌ రాయల్స్, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడనున్నాయి. గత సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లోనూ రాజస్తాన్‌ విజయం సాధించింది. అదే ఊపును ఈ సీజన్‌లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. అయితే రాజస్తాన్‌ స్టార్ పేస్ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ లేకపోవడం ఆ జట్టును కలవరపరుస్తోంది. ఎందుకంటే.. గత సీజన్లో అతడు అద్భుతంగా రాణించాడు.

జోఫ్రా ఆర్చర్‌ లేకపోవడం రాజస్తాన్‌ రాయల్స్‌కు ‌పెద్ద ఎదురుదెబ్బ అని ఆ జట్టు కొత్త డైరెక్టర్, శ్రీలంక దిగ్గజం‌ కుమార సంగక్కర స్పష్టం చేశాడు. తమ ప్రణాళికలు అమలు చేస్తేనే పంజాబ్‌ కింగ్స్‌ను నిలువరించగలమన్నాడు. ఆదివారం సంగక్కర పీటీఐతో మాట్లాడుతూ... 'సంజూ శాంసన్ ‌(కెప్టెన్‌), నేను ఒక్క విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. ఆర్చర్‌ మాకు పెద్ద బలం. ఈసారి అతను అందుబాటులో లేకపోవడంతో గట్టి దెబ్బ తగిలినట్టయ్యింది. ఇక మా ప్రణాళికలు అమలు చేస్తేనే పంజాబ్‌ కింగ్స్‌ను నిలువరించగలం' అని అన్నాడు.

SRH vs KKR: మూడుసార్లు గోల్డెన్‌ డక్‌‌.. మూడుసార్లు 80+ స్కోర్స్! రానా అరుదైన రికార్డు!SRH vs KKR: మూడుసార్లు గోల్డెన్‌ డక్‌‌.. మూడుసార్లు 80+ స్కోర్స్! రానా అరుదైన రికార్డు!

గత నెలలో భారత్‌తో సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్‌ చేతికి గాయమైంది. దీనికి సుదీర్ఘ విశ్రాంతి అవసరం కావడంతో ఐపీఎల్‌ 2021లో ఆడటంపై స్పష్టత లేదు. ఈ టోర్నీ మధ్య నుంచి కలుస్తాడనకున్నా.. ఇప్పుడు అది కూడా సాధ్యపడేలా కనుబడటం లేదు. ఆర్చర్‌ స్థానాన్ని క్రిస్‌ మోరిస్‌తో పూడ్చాలని రాజస్తాన్‌ రాయల్స్ భావిస్తోంది. ఈ ఏడాది జరిగిన వేలంలో మోరిస్‌కు 16 కోట్లు పైగా చెల్లించి రాజస్తాన్‌ తీసుకుంది. మోరిస్ బౌలింగ్ మాత్రమే కాదు బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి రాయల్స్‌కు కలిసొచ్చే విషయమనే చెప్పాలి.

ఐపీఎల్ 2018 నుంచి రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కి జోఫ్రా ఆర్చర్ ఆడుతున్నాడు. ఆ ఏడాది 15 వికెట్లు పడగొట్టిన ఆర్చర్.. 2019లో 11 వికెట్లు మాత్రమే తీశాడు. కానీ ఐపీఎల్ 2021 సీజన్‌లో అసాధారణరీతిలో ఆర్చర్ రాణించాడు. 14 మ్యాచ్‌లాడి 20 వికెట్లు తీశాడు. ఫస్ట్ పవర్‌ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీయగలిగే ఆర్చర్.. స్లాగ్ ఓవర్లలోనూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయగలడు. ఈ నేపథ్యంలో ఆర్చర్‌ లేకపోతే రాజస్థాన్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడనుంది. ఆర్చర్ ఇంగ్లండ్ తరఫున 13 టెస్టులు ఆడి 42 వికెట్లు పడగొట్టాడు. 17 వన్డేల్లో 30, 12 టీ20ల్లో 14 వికెట్లు తీశాడు. మూడు ఫార్మాట్‌లలో 155, 27, 19 పరుగులు చేశాడు. ఇక 35 ఐపీఎల్ మ్యాచులలో 46 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Monday, April 12, 2021, 7:59 [IST]
Other articles published on Apr 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X