న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీని ఎందుకు మిస్ అవుతున్నాడో అసలు కారణం చెప్పిన కుల్‌దీప్‌!!

Kuldeep Yadav explains why he is missing MS Dhoni in the Indian team

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీని తాను చాలా మిస్ అవుతున్నట్టు మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్ చెప్పాడు. ధోనీ కీపింగ్‌ చేస్తున్నప్పుడు ఫీల్డింగ్‌ మోహరింపుల విషయం తాను ఏమాత్రం ఆలోచించనన్నాడు. అతడు మార్గదర్శకత్వం వహించడంతోనే తాము మెరుగ్గా రాణించమని పేర్కొన్నాడు. మహీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని కుల్‌దీప్‌ వెల్లడించాడు. వికెట్ల వెనక ఉండే మహీ.. భారత బౌలర్లకు సూచనలు ఇస్తూ వారికి ఎంతగానో ఉపయోగపడుతాడు.

విరాట్ వర్కౌట్ వీడియోపై పీటర్సన్ సెటైర్.. అదిరే పంచ్ ఇచ్చిన కోహ్లీ!!విరాట్ వర్కౌట్ వీడియోపై పీటర్సన్ సెటైర్.. అదిరే పంచ్ ఇచ్చిన కోహ్లీ!!

ధోనీ ఉంటే చాలు:

ధోనీ ఉంటే చాలు:

తాజాగా ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌బాజీ కార్యక్రమంలో కుల్‌దీప్‌ యాదవ్ మాట్లాడుతూ... 'కెరీర్‌ ఆరంభంలో పిచ్‌లను అధ్యయనం చేయడం నాకంతగా రాదు. ఎంఎస్‌ ధోనీతో కలిసి ఆడటం ఆరంభించాకే నాకీ విషయంలో అనుభవం వచ్చింది. బంతిని ఎప్పుడు స్పిన్‌ చేయాలో, ఎక్కడ పిచ్‌ చేయాలో అతడు తరుచూ చెప్తుండేవాడు. మైదానంలో ఫీల్డర్లను మోహరించడంలో ధోనీ సిద్ధహస్తుడు. అందుకే అతడు కీపింగ్‌ చేస్తుంటే.. నేనెప్పుడూ ఫీల్డింగ్‌ పొజిషన్ల గురించి పట్టించుకోను' అని తెలిపాడు.

చాలా మిస్ అవుతున్నా:

చాలా మిస్ అవుతున్నా:

'నా బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్‌ ఎలా ఆడతారో అర్థంచేసుకొని అందుకు అనుగుణంగా మహీ భాయ్ ఫీల్డర్లను మోహరిస్తాడు. నాకు ఒక్కడికే కాదు.. జట్టులోని అందరికి ఇలానే చేస్తాడు. బ్యాట్స్‌మన్‌ భారీగా పరుగులు చేస్తున్నపుడు.. ఎలా బౌలింగ్ చేయాలో సలహాలు ఇస్తాడు. బ్యాట్స్‌మన్‌ కదలికలను బట్టి బంతి వేయమని చెప్పేవాడు. మహీ భాయ్ సలహాలు చాలా సక్సెస్ అయ్యాయి. మహీ మైదానంలో ఉంటే ఎంతో ఆత్మవిశ్వాసంగా అనిపిస్తుంది. ఏడాదిగా వన్డేల్లో అతడు కొనసాగకపోవడంతో లోటు కనిపిస్తోంది' అని మణికట్టు స్పిన్నర్ చెప్పాడు.

ఇప్పుడు బెంగలేదు:

ఇప్పుడు బెంగలేదు:

'నాకు ఏబీ డివిలియర్స్‌కు బౌలింగ్‌ చేయడమంటే కత్తిమీద సాములా ఉండేది. నన్ను అత్యంత భయపెట్టిన బ్యాట్స్‌మన్‌ అతడు. నా బౌలింగ్‌లో ఎదురుదాడి చేసి భారీగా పరుగులు సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అది అంతర్జాతీయ క్రికెట్‌లో కావచ్చు లేదా ఐపీఎల్ కావొచ్చు. డివిలియర్స్ రిటైర్‌ అయిపోయాడు కాబట్టి బెంగలేదు కానీ.. లేదంటే నా లాంటి బౌలర్లు ఎంతోమంది బలయ్యేవారు. నేను కూడా మరోసారి అతడికి బాధితుడిని అయ్యేవాడినేమో' అని కుల్‌దీప్‌ పేర్కొన్నాడు.

మూడు ఫార్మాట్‌లలో 167 వికెట్లు:

మూడు ఫార్మాట్‌లలో 167 వికెట్లు:

టెస్టుల్లో ఆసీస్‌ మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ బ్యాటింగ్‌ చాలెంజింగ్‌గా ఉంటుందని ణికట్టు మాంత్రికుడు కుల్‌దీప్‌ యాదవ్ తెలిపాడు. ఎక్కవ బ్యాక్‌ ఫుట్‌లో ఆడటమే కాకుండా చాలా ఆలస్యంగా బంతిని ఆడటం తనకు సవాల్‌గా ఉండేదన్నాడు. కుల్‌దీప్‌ భారత్ తరపున 6 టెస్టులు, 60 వన్డేలు, 21 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 167 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Saturday, July 4, 2020, 16:13 [IST]
Other articles published on Jul 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X