న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్ గడ్డపై తొలి బౌలర్‌గా కుల్దీప్‌ యాదవ్ సరికొత్త రికార్డు

Kuldeep Yadav creates new record, becomes first bowler to take consecutive four-fers in New Zealand

హైదరాబాద్: మౌంట్ మాంగనూయ్ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ అరుదైన ఘనతను సాధించాడు. శనివారం న్యూజిలాండ్‌తో ముగిసిన రెండో వన్డేలో భారత్‌ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. కుల్దీప్‌ నాలుగు వికెట్లతో రాణించి భారత్‌ ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు.

2nd ODIలో భారత్ ఘన విజయం, 2-0కు పెరిగిన సిరిస్ ఆధిక్యం2nd ODIలో భారత్ ఘన విజయం, 2-0కు పెరిగిన సిరిస్ ఆధిక్యం

న్యూజిలాండ్‌ గడ్డపై ఒక స్పిన్నర్ రెండు వరుస మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు తీయడం ఇదే మొదటిసారి. మొదటి వన్డేలో 39 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు, రెండో వన్డేలో 45 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఇప్పటివరకు తన కెరీర్‌లో 37 వన్డే మ్యాచ్‌లాడిన కుల్దీప్ మొత్తం 77 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

రెండో స్థానంలో కుల్దీప్

రెండో స్థానంలో కుల్దీప్

తద్వారా 37 వన్డే మ్యాచ్‌ల తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో కుల్దీప్‌ రెండో స్థానంలో నిలిచాడు. తొలి 37 వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో రషీద్‌ ఖాన్‌(అఫ్గానిస్తాన్‌) మొదటి స్థానంలో ఉండగా, కుల్దీప్‌ రెండో బౌలర్‌గా నిలిచాడు. రషీద్‌ 37 వన్డేలలో 87 వికెట్లు పడగొట్టాడు.

ముస్తాక్‌‌తో కలిసి స్టార్క్ మూడో స్థానంలో

ముస్తాక్‌‌తో కలిసి స్టార్క్ మూడో స్థానంలో

ఈ జాబితాలో సక్లయిన్‌ ముస్తాక్‌ (పాకిస్తాన్‌), మిచెల్‌ స్టార్క్‌ ( ఆస్ట్రేలియా)లు సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఆ తర్వాత స్థానాల్లో అజంతా మెండిస్‌(శ్రీలంక) 72 వికెట్లతో నాలుగో స్థానంలో ఉండగా, షేన్‌ బాండ్‌, హసన్‌ అలీలు 71 వికెట్లతో సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నారు.

సోమవారం మూడో వన్డే

సోమవారం మూడో వన్డే

న్యూజిలాండ్‌తో శనివారం ముగిసిన రెండో వన్డేలో భారత్‌ 90 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్‌ నిర్దేశించిన 325 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత బౌలర్ల దెబ్బకు 40.2 ఓవర్లలోనే 234 పరుగులు చేసి ఆలౌటైంది. సిరిస్‌లో మూడో వన్డే సోమవారం ఉదయం 7.30 గంటల ఇదే స్టేడియం వేదికగా జరగనుంది.

Story first published: Sunday, January 27, 2019, 13:57 [IST]
Other articles published on Jan 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X