న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KPL fixing: ఇద్దరు బళ్లారి టస్కర్స్ ఆటగాళ్లను అరెస్ట్ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

Match-Fixing : Case Filed On Mumbai Indians Player ! || Oneindia Telugu
KPL fixing: Sleuths arrest CM Gautam, Abrar Kazi of Bellary Tuskers

హైదరాబాద్: కర్ణాటకకు చెందిన ఇద్దరు దేశవాళీ క్రికెటర్లను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్)లో బళ్లారి టస్కర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సీఎం గౌతమ్, అక్బర్ ఖాజీలు స్పాట్ పిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

బళ్లారి టస్కర్స్ జట్టుకు గౌతమ్ కెప్టెన్‌గా వ్యవహారిస్తుండగా... అక్బర్ ఖాజీ వికెట్ కీపర్, ఆల్ రౌండర్‌‌గా సేవలందిస్తున్నాడు. కర్ణాటక ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత గౌతమ్ ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ సీజన్‌లో గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఖాజీ మిజోరాంకు ఆడుతున్నాడు.

'సీనియర్లతో డ్రస్సింగ్‌ రూమ్‌ పంచుకున్నా.. ఎంతో నేర్చుకున్నా''సీనియర్లతో డ్రస్సింగ్‌ రూమ్‌ పంచుకున్నా.. ఎంతో నేర్చుకున్నా'

ఫైనల్ మ్యాచ్‌లో బళ్లారి టస్కర్స్ vs హుబ్లి టైగర్స్

ఫైనల్ మ్యాచ్‌లో బళ్లారి టస్కర్స్ vs హుబ్లి టైగర్స్

ఇటీవలే ముగిసిన కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్) ఫైనల్ మ్యాచ్‌లో బళ్లారి టస్కర్స్, హుబ్లి టైగర్స్ జట్లు తలపడ్డాయి. ఫైనల్లో బళ్లారి టస్కర్స్ జట్టు బ్యాటింగ్ స్లోగా ఆడేందుకు గాను రూ.20 లక్షలు తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. దర్యాప్తు సజావుగా జరుగుతోందని రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఐపీఎల్‌లో పలు జట్లకు

ఐపీఎల్‌లో పలు జట్లకు

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ వంటి జట్లకు గౌతమ్ ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటివరకు మొత్తం 94 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆిడన గౌతమ్ 41.4 యావరేజితో 4716 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

గౌతమ్ ఎంతో కీలకం

గౌతమ్ ఎంతో కీలకం

2013-14 మరియు 2014-15లలో కర్ణాటక జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో గౌతమ్ ఎంతో కీలకంగా వ్యవహారించాడు. ఇక, ఖాజీ విషయానికి వస్తే మిజోరం జట్టుకు ఆడటానికి ముందు గత సీజన్‌లో నాగాలాండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. శుక్రవారం నుంచి ఆరంభమయ్యే ముస్తాక్ అలీ ట్రోఫీలో మిజోరాం జట్టు తరుపున ఎంపికయ్యాడు.

తాజా అరెస్ట్ ఇది

తాజా అరెస్ట్ ఇది

బెంగళూరు బ్లాస్టర్స్ ఆటగాళ్ళు విను ప్రసాద్, ఎం విశ్వనాథ్లను అదుపులోకి తీసుకున్న తర్వాత గత వారం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిశాంత్ సింగ్ షేఖావత్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కేపీఎల్ ఫిక్సింగ్‌కు సంబంధించి గౌతమ్, కాజీల అరెస్టు తాజాది కావడం విశేషం. అంతకముందు సెప్టెంబర్‌లో బెళగావి ఫాంథర్స్ జట్టు ఓనర్ అస్ఫక్ అలీ తారా అరెస్టైన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, November 7, 2019, 11:58 [IST]
Other articles published on Nov 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X