న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇలా గెలవడం ఆర్‌సీబీకి మూడోసారి, 500రేసులో తొలి స్థానంలో కోహ్లీ

Kohli Steals Show as RCB Register Third 10-wicket Victory in IPL

హైదరాబాద్: ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అరుదైన రికార్డును నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ.. 10 వికెట్ల తేడాతో గెలుపొంది ఈ సీజన్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అంతేగాకుండా ఇలా వికెట్‌ నష్టపోకుండా 10 వికెట్ల తేడాతో గెలవడం బెంగళూరుకు ఇది మూడో సారి కాగా.. ఏ జట్టు కూడా ఇలా ఒకసారికి మించి గెలవలేకపోవడం విశేషం.

2010 సీజన్‌లో తొలి సారి రాజస్తాన్‌ రాయల్స్‌తో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా ఛేదించిన ఆర్సీబీ.. 2015లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌పై 96 పరుగుల లక్ష్యాన్ని మరోసారి ఛేదించింది. ఇక తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా అధిగమించి ఐపీఎల్‌ చరిత్రల్లో మూడు సార్లు ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు స్పష్టించింది.

ఉమేశ్‌, కోహ్లిల రికార్డు..:

ఉమేశ్‌, కోహ్లిల రికార్డు..:

పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు సాధించి పంజాబ్‌పై ఐదో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అందుకున్నాడు. ఉమేశ్‌ యాదవ్‌ తర్వాత యూసుఫ్‌ పఠాన్‌ (దక్కన్‌ చార్జర్స్‌పై) మాత్రమే ఒకే ప్రత్యర్థిపై ఐదు సార్లు మ్యాన్‌ ఆఫ్‌ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. వీరితో పాటుగా ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డును తన సొంతం చేసుకున్నాడు.

ఎక్కువ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా:

ఎక్కువ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా:

ఐపీఎల్ ఐదు సీజన్లలో 500 అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లి నిలిచాడు. కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో 48 రన్స్ చేసిన విరాట్.. ఈ సీజన్‌లోనూ 500 రన్స్ మార్క్ దాటాడు. ఈ సీజన్‌లోనూ 500 రన్ మార్క్ దాటి వార్నర్‌ను వెనక్కి నెట్టాడు. ఈ ఇద్దరి తర్వాత రైనా, గేల్, గంభీర్ మూడేసి సార్లు 500 కన్నా ఎక్కువ పరుగులు చేయగా.. సచిన్ రెండుసార్లు ఈ ఘనత సాధించాడు. కోహ్లి తొలిసారి 2011 సీజన్‌లో 16 మ్యాచుల్లో 557 పరుగులు చేశాడు.

ఈ సీజన్‌లో 514 పరుగులతో.. టాప్ ఫామ్‌లో:

ఈ సీజన్‌లో 514 పరుగులతో.. టాప్ ఫామ్‌లో:

ఇక 2013లో 16 మ్యాచుల్లో 634, 2015లో 16 మ్యాచుల్లో 505, 2016లో 16 మ్యాచుల్లో 973, 2018లో ఇప్పటివరకు 12 మ్యాచుల్లో 514 పరుగులు చేశాడు. ఇక ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు రికార్డు కూడా కోహ్లి పేరిటే ఉంది. 2016లో ఏకంగా 973 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో బెంగళూరు ఆశించిన విజయాలు సాధించకపోయినా.. కోహ్లి మాత్రం టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో 514 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.

రైనాను వెనక్కి నెట్టిన కోహ్లి:

రైనాను వెనక్కి నెట్టిన కోహ్లి:

ఢిల్లీ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ 582 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును కూడా కోహ్లి సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో రైనాను వెనక్కి నెట్టాడు. కోహ్లి 147 మ్యాచుల్లో 4767 పరుగులు చేయగా.. రైనా 158 మ్యాచుల్లో 4544 రన్స్ చేశాడు.

Story first published: Tuesday, May 15, 2018, 13:18 [IST]
Other articles published on May 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X