న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీ నేర్చుకోవాల్సింది ఇంకా చాలానే ఉంది'

Kohli Needs to Learn About Field Placements & Bowling Changes, Says Gavaskar

హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టుతో పోరాడేందుకు సుదీర్ఘ పర్యటన చేపట్టిన టీమిండియా కెప్టెన్‌పై విమర్శల దుమారం చెలరేగుతూనే ఉంది. ఇంగ్లాండ్ జట్టుపై ఒక సిరీస్ విజయం సాధించి మిగిలిన రెండింటిలోనూ పరాజయం పొందిన టీమిండియా.. భారత్‌కు తిరుగు ప్రయాణమై మరో టోర్నీకి సిద్ధమైపోతుంది కూడా. కానీ, ఆఖరి పర్యటన వైఫల్యాలు కెప్టెన్ కోహ్లీని వెంటాడుతూనే ఉన్నాయి.

<strong>'కోహ్లీ లేకపోయినా భారత్.. ప్రపంచ అత్యుత్తమ జట్టే'</strong>'కోహ్లీ లేకపోయినా భారత్.. ప్రపంచ అత్యుత్తమ జట్టే'

ఐదు టెస్టుల సిరీస్‌ని భారత్ జట్టు 1-4 తేడాతో

ఐదు టెస్టుల సిరీస్‌ని భారత్ జట్టు 1-4 తేడాతో

ఇప్పటికే పలువురు కోహ్లీపై విమర్శలు సంధించగా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం తన గొంతు కలిపాడు. భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్ల గడుస్తున్నా.. ఫీల్డింగ్ కూర్పు, బౌలర్ల మార్పులో విరాట్ కోహ్లీ ఇంకా పరిణతి సాధించలేదని సునీల్ గవాస్కర్ విమర్శించాడు. ఇంగ్లాండ్ గడ్డపై మంగళవారం ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌ని భారత్ జట్టు 1-4 తేడాతో పేలవరీతిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే.

కెప్టెన్సీలో అపరిపక్వత స్పష్టంగా

కెప్టెన్సీలో అపరిపక్వత స్పష్టంగా

సిరీస్ జరిగిన తీరు గురించి గురువారం మీడియాతో మాట్లాడిన గవాస్కర్.. కోహ్లీ కెప్టెన్సీలో అపరిపక్వత స్పష్టంగా కనబడుతోందని వెల్లడించాడు. 2014 చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా.. సిరీస్ మధ్యలోనే కెప్టెన్సీతో పాటు టెస్టు క్రికెట్‌కి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 కెప్టెన్‌గా కోహ్లీ ఇంకా చాలా అంశాలు :

కెప్టెన్‌గా కోహ్లీ ఇంకా చాలా అంశాలు :

‘కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఇంకా చాలా అంశాలు నేర్చుకోవాల్సి ఉంది. మైదానంలో ఫీల్డింగ్ కూర్పు, మ్యాచ్ గమనానికి అనుగుణంగా బౌలర్ల మార్పుపై అతను ఇంకా పరిణతి సాధించాలి. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌‌తో పాటు ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనూ ఆ లోపం స్పష్టంగా తెలుస్తోంది. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్ల గడుస్తున్నా.. కోహ్లీలో ఇంకా అనుభవలేమి కనిపిస్తోంది' అని సునీల్ గవాస్కర్ వెల్లడించాడు.

సెప్టెంబర్ 18న హాంగ్‌కాంగ్‌తో జరిగే ..:

సెప్టెంబర్ 18న హాంగ్‌కాంగ్‌తో జరిగే ..:

ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 18న హాంగ్‌కాంగ్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో 16 మంది సభ్యులతో కూడిన జట్టుతో టీమిండియా ఖాతా తెరవనుంది. ఈ టోర్నీకి వేదికలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్, అబు దాబిలు కానున్నాయి. టోర్నమెంట్‌లో ఉన్న గ్రూపులు రెండు ఏ, బీ. ఇందులో గ్రూపు ఏ కు సంబంధించి ఇండియా, పాకిస్తాన్, హాంగ్‌కాంగ్ . గ్రూపు బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్‌లు ఉన్నాయి.

Story first published: Friday, September 14, 2018, 11:47 [IST]
Other articles published on Sep 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X