న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీకి బీసీసీఐ చెక్ పెట్టనుందా? వన్డేలకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ!

Kohli For Tests,Rohit For Shorter Formats; BCCI To Adopt Split Captaincy?
 Kohli for Tests, Rohit for shorter formats; BCCI to adopt split captaincy?

హైదరాబాద్: ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో ఆధిపత్యం ప్రదర్శించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్‌లో పేలవమైన ఆటతీరు కనబరిచిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ చెత్త ప్రదర్శన చేయడంతో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నిష్క్రమణతో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు టీమిండియా పగ్గాలు అప్పగించాలనే వాదన తెరపైకి వచ్చింది.

న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ మినహా ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. అంతేకాదు ఈ ప్రపంచకప్‌లో మొత్తం 648 పరుగులతో టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 5 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక పరుగుకే పెవిలియన్‌కు చేరాడు.

కోహ్లీపై కెప్టెన్సీపై ప్రభావం

కోహ్లీపై కెప్టెన్సీపై ప్రభావం

ఈ ఓటమి టీమిండియా విరాట్ కోహ్లీపై కెప్టెన్సీపై కూడా ప్రభావం చూపింది. ఇందులో భాగంగా బీసీసీఐ సైతం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు ఒక కెప్టెన్, సుదీర్ఘ ఫార్మాట్‌కు మరొక కెప్టెన్‌ను నియమించాలని భావిస్తోంది. ఇందుకు ఉదహరణగా ఇంగ్లాండ్ జట్టుని చూపిస్తున్నారు.

ఇంగ్లాండ్ ఆదర్శం

ఇంగ్లాండ్ ఆదర్శం

2015 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ పేలవ ప్రదర్శన చేసింది. అయితే, ఆ తర్వాత ఆ జట్టులో చేసిన సమూల మార్పులే 2019లో ప్రపంచకప్‌ను గెలిచేలా చేశాయని బోర్డు సైతం భావిస్తోంది. ఇందులో భాగంగా టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ... వన్డేలు, టీ20ల్లో రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించాలని చూస్తోంది.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ

కెప్టెన్‌గా రోహిత్ శర్మ

ఈ మేరకు బోర్డు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ "50 ఓవర్ల ఫార్మాట్‌కు రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు ఇదే సరైన సమయం. జట్టు మేనేజ్‌మెంట్‌తో పాటు ప్రస్తుత కెప్టెన్ ఇందుకు సానుకూలంగానే ఉన్నారు. వచ్చే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం సరైందే" అని అన్నారు.

రోహిత్ శర్మనే సరైన వ్యక్తి

రోహిత్ శర్మనే సరైన వ్యక్తి

"మన అందరికీ తెలుసు, కొన్ని ఏరియాల్లో పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఆ జాబ్‌కు రోహిత్ శర్మనే సరైన వ్యక్తి" అని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శనపై త్వరలోనే రివ్యూ మీటింగ్ ఉంటుందని సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు.

త్వరలో రివ్యూ మీటింగ్

త్వరలో రివ్యూ మీటింగ్

ఆ మీటింగ్‌లో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేసే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ తన ట్విట్టర్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2023 వరల్డ్‌కప్ ఆడాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Story first published: Monday, July 15, 2019, 17:19 [IST]
Other articles published on Jul 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X