ఐపీఎల్‌లో బిజీగా స్టార్ క్రికెటర్లు, మరి టీమిండియా కోచ్ రవిశాస్త్రి?

Posted By:
Kohli & Boys Sweat it Out in IPL as Shastri Enjoys Break in Bahrain

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో భాగంగా దాదాపు జట్టు ఆటగాళ్లందరూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. కొద్ది రోజుల ముందే ముగిసిన నిదహాస్ ట్రోఫీతో ఇండియా జట్టు ఆటగాళ్లకు కోచ్‌గా వ్యవహరించిన రవిశాస్త్రి... ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా.. విదేశీ సూపర్ స్టార్లతో పోటీగా రాణించాలని కుర్రాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. తమ ఫ్రాంఛైజీల తరఫున మెరుగైన ప్రదర్శన చేసి టైటిల్ గెలవడంలో తమపాత్ర పోషించాలని భారత సీనియర్లు ఆరాటపడుతున్నారు.

ఈ నేపథ్యంలో భారత జాతీయ క్రికెట్ జట్టు కోచ్, సహాయసిబ్బందికి పూర్తి విరామం దొరికింది. తీరికలేని మ్యాచ్‌లతో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుందని, బిజీ షెడ్యూల్‌పై పునరాలోచించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు కోచ్ రవిశాస్త్రి కూడా బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విరామం లభించడంతో రవిశాస్త్రి విదేశాల్లో విహారయాత్రకు వెళ్లాడు.

స్పోర్ట్స్ ప్రేమికుడైన శాస్త్రి బహ్రైన్ గ్రాండ్ ప్రి ఫార్ములావన్ రేసు చూసేందుకు బహ్రైన్ వెళ్లాడు. ఈ రేసులో ఫార్ములావన్ స్టార్లు సెబాస్టియన్ వెటల్, లూయిస్ హామిల్టన్, డేనియల్ రికార్డో తదితరులు పాల్గొన్నారు. తాజాగా ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నానని రవిశాస్త్రి ట్విటర్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

కాగా, తొలి మ్యాచ్ గా ఆరంభమైన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ శనివారం ముగిసింది. ఇందులో ఒక వికెట్, ఒక బాల్ మిగిలి ఉండగానే కేదర్ జాదవ్ 166 పరుగుల లక్ష్యాన్ని చేధించాడు. ఈ మ్యాచ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు డేన్ బ్రావోను వరించింది. అతనొక్కడే 30 బంతులలో 68 పరుగులను చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Sunday, April 8, 2018, 17:21 [IST]
Other articles published on Apr 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి