న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ ఐసీసీ ర్యాంకింగ్: పోయిందనుకుంది.. తిరిగొచ్చింది

India vs Engalnd 3rd Test: Kohli Reclaims His Spot In ICC Test Rankings For Batsmen
Kohli back at the summit, Pandya makes big gains

నాటింగ్‌హామ్: తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇలా కోహ్లి తిరిగి ఐసీసీ నంబర్ వన్ టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 103 రన్స్ చేసిన విరాట్.. స్మిత్‌ను వెనక్కి నెట్టి తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. తొలి టెస్టులోనూ ఇదే తరహాలో రెండు ఇన్నింగ్స్ కలిపి 200పరుగులు చేసి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న కోహ్లీ.. రెండో టెస్టులో నిలబెట్టుకోలేకపోయాడు.

ప్రస్తుతం కోహ్లి ఖాతాలో 937 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఏడాదిపాటు నిషేదం వేటు ఎదుర్కొంటున్న స్మిత్‌ను వెనక్కి నెట్టాడు. కానీ రెండో టెస్టులో 40 పరుగులు మాత్రమే చేయడంతో.. టాప్ పొజిషన్‌ను కోల్పోయాడు. మూడో టెస్టులో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన విరాట్ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో పేలవ ఆటతీరు కనబరుస్తోన్న జో రూట్ ఐదో స్థానానికి పడిపోయాడు. విరాట్ మరో పాయింట్ సాధిస్తే.. ఆల్‌టైం రేటింగ్ పాయింట్లలో టాప్-10 ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు.

1
42376

బ్రాడ్‌మాన్ (961), స్టీవ్ స్మిత్ (947), జాక్ హబ్స్, రిక్కీ పాంటింగ్ (ఇద్దరూ 942) పాయింట్లు సాధించగా.. పీటర్ మే, గ్యారీ సోబర్స్, క్లైడ్ వాల్కాట్, వివియన్ రిచర్డ్స్, కుమార సంగక్కర (వీరంతా 938 పాయింట్లు) సాధించారు.మూడో టెస్టులో ఐదు వికెట్ల హాల్ సాధించడంతోపాటు హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచిన హార్దిక్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఎగబాకాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 8 స్థానాలు ఎగబాకి 51వ స్థానానికి చేరుకున్న పాండ్యా.. బౌలింగ్ విభాగంలో 23 స్థానాలు మెరుగుపర్చుకొని 51వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో ఏకంగా 27 స్థానాలు మెరుపర్చుకొని 17వ స్థానం దక్కించుకున్నాడు.

మిగతా ఆటగాళ్లలో చటేశ్వర పుజారా ఆరవ స్థానంలో కొనసాగుతుండగా.. అజింక్యా రహానే 19వ, ధావన్‌ 22వ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌లో ఎనిమిది స్థానాలు ఎగబాకి 51 వ స్థానంలో నిలవగా, బౌలింగ్‌లో 23 స్థానాలు మెరుగుపర్చుకొని 51వ స్థానం ఆక్రమించాడు. ఆల్‌రౌండర్‌ జాబితాలో 17వ స్థానాన్ని పాండ్యా సాధించాడు. ఇక బౌలర్ల జాబితాలో రవీంద్ర జడేజా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్‌, షమీలు వరుసగా 7,22 స్థానాలలో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ ఆగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Thursday, August 23, 2018, 18:18 [IST]
Other articles published on Aug 23, 2018
Read in English: Kohli returns to the summit
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X