న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోల్‌కతా టెస్టులో సమయం వృధా: డిక్వెల్లా చర్యలను సమర్ధించిన కోహ్లీ

By Nageshwara Rao
Kohli applauds Dickwella's character

హైదరాబాద్: భారత్‌తో కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఉద్దేశపూర్వకంగా సమయం వృధా చేసిన శ్రీలంక క్రికెటర్ నిరోషాన్ డిక్వెల్లా చర్యలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సమర్ధించాడు. నాగ్‌పూర్ వేదికగా శుక్రవారం రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.

ఈడెన్‌లో కొట్టుకునేంత పనిచేశారు: షమీ, డిక్‌వెల్లా మధ్య మాటల యుద్ధంఈడెన్‌లో కొట్టుకునేంత పనిచేశారు: షమీ, డిక్‌వెల్లా మధ్య మాటల యుద్ధం

ఈ సందర్భంగా తొలి టెస్టు చివరి రోజు చివరల్లో ఓటమి తప్పించుకోడానికి డిక్వెల్లా అనుసరించిన చర్యల్లో తప్పేమీ కనిపించలేదని కోహ్లీ పేర్కొన్నాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన షమి బౌలింగ్‌లో పదేపదే బంతికి బంతికి మధ్య టైమ్ తీసుకుంటుండటంతో అతనికి కోపమొచ్చింది. దీంతో క్రీజులో ఉన్న డిక్‌వెల్లాపై షమీ ఆగ్రహం వ్యక్తంచేశాడు.

అతని దగ్గరికి వెళ్లి ఏదో మాటన్నాడు. ఆ తర్వాతి బంతికి డిక్‌వెలా మళ్లీ అలాగే చేయడంతో ఈసారి కెప్టెన్ విరాట్ కోహ్లీ నేరుగా అంపైర్ దగ్గరికి వెళ్లి అతనిపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఇద్దరు అంపైర్లు కలిసి ప్లేయర్స్‌ను శాంతింపజేశారు. దీనిపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ 'ఆ సమయంలో డిక్‌వెలా చేసింది కరెక్టే. ఆ సమయంలో ఎవరున్నా అలాగే చేస్తారు' అని అన్నాడు.

ఓటమి భయం: 'ఈడెన్‌లో కావాలనే సమయం వృధా చేశా'ఓటమి భయం: 'ఈడెన్‌లో కావాలనే సమయం వృధా చేశా'

చివరిరోజైన సోమవారం ఆటలో భాగంగా 231 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు కోల్పోయి 75 పరుగుల వద్ద ఉండగా బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్‌ను అంఫైర్లు నిలిపివేశారు. శ్రీలంక జట్టుని ఓటమి నుంచి తప్పించాలన్న అతడి పట్టుదల తనకు ఎంతగానో నచ్చిందని కోహ్లీ తెలిపాడు.

Story first published: Friday, November 24, 2017, 11:47 [IST]
Other articles published on Nov 24, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X