న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిలకడలేని కేఎల్ రాహుల్... టెస్టు ఓపెనర్‌గా రోహిత్ శర్మ పేరు ప్రతిపాదన

KL Rahuls Inconsistency Makes Room For Rohit As Test Opener : Ganguly || Oneindia Telugu
KL Rahuls inconsistency makes room for Rohit Sharma as Test opener: Ganguly

హైదరాబాద్: టెస్టు ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ స్థానంలో రోహిత్ శర్మకు ఓ అవకాశం ఇవ్వాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు. వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా 2-0తో టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకున్నప్పటికీ... ఓపెనర్ల కాంబినేషన్ పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే.

వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్‌ 44, 38, 13, 6 పరుగులు మాత్రమే చేశాడు. టెస్టుల్లో గత చివరి 12 ఇన్నింగ్స్‌ల్లో కేఎల్ రాహుల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేక పోయాడు. దీనిపై సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ఓపెనింగ్‌ జోడీపై ఇంకా వర్క్ చేయాల్సి ఉందని అన్నాడు.

<strong>జట్టు విజయం సాధించాలంటే ఏం చేయాలో తెలుసు: భారత పర్యటనపై రబాడ</strong>జట్టు విజయం సాధించాలంటే ఏం చేయాలో తెలుసు: భారత పర్యటనపై రబాడ

మయాంక్‌ ఫరవాలేదు

మయాంక్‌ ఫరవాలేదు

"మయాంక్‌ ఫర్వాలేదనిపించాడు. అతడికి మరికొన్ని అవకాశాలు ఇవ్వొచ్చు. అతడి భాగస్వామి కేఎల్‌ రాహుల్‌ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు" అని గంగూలీ అన్నాడు. వెస్టిండిస్ పర్యటనలో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు ముందు ఓపెనర్‌గా రోహిత్ శర్మను ఆడించాలని గంగూలీ సూచించిన సంగతి తెలిసిందే.

ఓపెనర్‌గా రోహిత్ శర్మ

ఓపెనర్‌గా రోహిత్ శర్మ

"టెస్టుల్లో రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా ప్రయత్నించాలని ఇంతకుముందే చెప్పా. అతనో అద్భుతమైన ఆటగాడు. అతడికి ఓ అవకాశం ఇవ్వాలని నేను ఇప్పటికీ నమ్ముతున్నా. వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత అతడు టెస్టుల్లో స్థానం దక్కుతుందని ఆశించాడు. మిడిలార్డర్‌లో రహానే, విహారి నిలదొక్కుకోవడంతో వేరేవారికి అవకాశం లేదు" అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

బౌలింగ్‌ విభాగం అద్భుత ప్రదర్శన

బౌలింగ్‌ విభాగం అద్భుత ప్రదర్శన

"వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా బౌలింగ్‌ విభాగం అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా పేసర్లు. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో ఎంతో పరిణితి వచ్చింది. రాబోయే రోజుల్లో అతడు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడు. స్పీడ్ మాత్రమే కాదు.. బౌలింగ్‌లో వ్యత్యాసంతో పాటు లైన్ అండ్ లెంత్ నిజంగా అద్భుతం. బుమ్రాను గాయాల బారిన పడకుండా సహాయ సిబ్బంది అతడిని పర్యవేక్షించాలి" అని గంగూలీ అన్నాడు.

ఇషాంత్‌, షమి చక్కని సహకారం

ఇషాంత్‌, షమి చక్కని సహకారం

"ఇషాంత్‌, షమి అతడికి చక్కని సహకారం అందించాడు. భువనేశ్వర్ కుమార్, ఉమేశ్‌ యాదవ్, నవదీప్‌ సైనితో పేస్‌బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది. ప్రతి ఒక్కరి పనిభారాన్ని మోసే విధంగా ప్రస్తుతం పేస్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ బ్యాలెన్స్‌గా ఉంది" అని సౌరవ్ గంగూలీ అన్నాడు.

Story first published: Thursday, September 5, 2019, 17:42 [IST]
Other articles published on Sep 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X