న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చిన్నపిల్లల కోసం కేఎల్ రాహుల్ ఔదార్యం!

 KL Rahul auctions 2019 World Cup bat to raise funds for vulnerable children
Chennai Super Kings Is Like My Family - Bravo | KL Rahul Donation For Children

బెంగళూరు: దేశంలో వెనుకబడిన, దుర్భర జీవితం గడుపుతున్న చిన్నారులకు చేయూతనిచ్చేందుకు భారత క్రికెటర్‌ లోకేశ్‌ రాహుల్‌ ముందుకొచ్చాడు. ఇందు కోసం ఫండ్ రైజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా పిల్లల చదువు కోసం తనకు సంబంధించిన వస్తువులను వేలం వేయనున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను ఉపయోగించిన బ్యాట్‌తో పాటు జెర్సీలు, ప్యాడ్స్, గ్లౌజులు, హెల్మెట్స్‌ ఉంచనున్నట్లు రాహుల్‌ వీడియో మెసేజ్‌ ద్వారా ట్విటర్‌లో ప్రకటించాడు.

చిన్నారుల సంక్షేమం కోసం..

ఈ వేలం ద్వారా సమకూరే మొత్తాన్ని చిన్నారుల సంక్షేమం కోసం కృషిచేస్తోన్న ‘అవేర్‌ ఫౌండేషన్‌'కు ఇవ్వనున్నట్లు తెలిపాడు. ‘నేను నా క్రికెట్‌ వస్తువులను టీమిండియా మద్దతు బృందం ‘భారత్‌ ఆర్మీ'కి విరాళంగా ఇస్తాను. ఇందులో ప్రపంచకప్‌లో వాడిన బ్యాట్‌తో పాటు టెస్టు, వన్డే, టి20 జెర్సీలు, గ్లౌజులు, ప్యాడ్లు, హెల్మెట్లు ఉన్నాయి. వారు వీటిని వేలం ద్వారా విక్రయిస్తారు. వేలంలో సమకూరిన సొమ్మును వెనుకబడిన చిన్నారులను ఆదరిస్తోన్న ‘అవేర్‌' ఫౌండేషన్‌కు అందజేస్తారు. సోమవారం నుంచి వేలం ప్రారంభమవుతుంది. అందరూ ఇందులో పాల్గొని చిన్నారులకు సహాయపడండి' అని రాహుల్‌ విజ్ఞప్తి చేశాడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అందరం కలిసి ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చాడు. మరోవైపు కరోనా నిర్మూలన కోసం బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్.. 2013లో శ్రీలంకపై డబుల్ సెంచరీ చేసిన బ్యాట్‌ను వేలం వేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసందే.

 వామ్మో.. ర్యాపిడ్ ఫైరా?

వామ్మో.. ర్యాపిడ్ ఫైరా?

గత శనివారమే 28వ పుట్టినరోజు జరుపుకున్న కేఎల్ రాహుల్.. తన సహచర ఆటగాడు మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ లైవ్ సెషన్‌లో మయాంక్ అడిగిన పలు ప్రశ్నలకు రాహుల్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ముఖ్యంగా తన కెరీర్‌లోనే ఓ మాయని మచ్చగా మిగిలిపోయిన కాఫీ విత్ కరణ్ షో వివాదాన్ని గుర్తు చేసుకోని నవ్వులు పూయించాడు.లైవ్ సెషన్‌లో భాగంగా మయాంక్.. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అని రాహుల్‌కు తెలియజేశాడు. దీనికి రాహుల్..‘ఈ ర్యాపిడ్ ఫైర్‌లు నాకు అచ్చురావని నీకు తెలుసు కదా.. ఇదివరకే అందులో దెబ్బతిన్నా'అని కరణ్ జోహర్ షో వివాదాన్ని గుర్తు చేసుకొని ఫన్నీగా బదులిచ్చాడు. ఈ సమాధానం విన్న మయాంక్ పడిపడి నవ్వుకున్నాడు.

పీక కోస్తానని హెచ్చరించడంతోనే 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టా: యువరాజ్

 అతియా బర్త్‌డే విషెస్..

అతియా బర్త్‌డే విషెస్..

కేఎల్ రాహుల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అతని గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి 'హ్యాప్పీ బ‌ర్త్‌డే మై డియ‌ర్' అని విషెచేసింది. పైగా దీనికి ల‌వ్ ఎమోజీని కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వీరీ లవ్ ఎఫైర్ మరోసారి హాట్ టాపిక్ అయింది. గ‌త సంవ‌త్స‌రం అతియా శెట్టి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రాహుల్ ఆమెకు విషెస్ చెప్ప‌డంతో.. వీరిద్ద‌రి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందనే ప్రచారం ఊపందుకుంది. వీరు కూడా బాహటంగానే చెట్టాపట్టాలేసుకొని తిరగడం ఈ రూమర్స్‌కు బలాన్ని చేకూర్చుంది.

 ఫుల్ స్వింగ్‌లో రాహుల్..

ఫుల్ స్వింగ్‌లో రాహుల్..

గత కొంత కాలంగా రాహుల్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా న్యూజిలాండ్ పర్యటనలో తనదైన ఆటతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిడిలార్డర్, టాపార్డర్ ఇలా ఏ స్థానంలో వచ్చినా.. ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ పరుగుల మోత మోగించాడు.ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అనూహ్యంగా లభించిన కీపింగ్ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి జట్టులో స్పెషలిస్ట్ కీపర్ లేడనే డోకాను తీర్చాడు. అద్భుత కీపింగ్‌తో సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు చేశాడు. నాలుగో టీ20 మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ హోదాలో జట్టును నడిపించి.. తనలోని మరో కోణాన్ని చూపించాడు. ఇలా తన అద్భుత ఆటతీరుతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సారథిగాను ఎంపికయ్యాడు.

Story first published: Tuesday, April 21, 2020, 8:19 [IST]
Other articles published on Apr 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X