న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఖలీల్ అహ్మద్‌కు మంచి భవిష్యత్ ఉంది'

Khaleel Ahmed is an exciting prospect: India’s bowling coach Bharat Arun

హైదరాబాద్: కొన్నేళ్లుగా టీమిండియా ఫాస్ట్ బౌలర్లను ఉత్పత్తి చేయడంలో ముందుంటుంది. ఇదే క్రమంలో భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాలు ప్రత్యర్థులను బోల్తా కొట్టించడంలో ముందుంటారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రత్యేకమైన ఆటతీరు ప్రదర్శించే ఫాస్ట్ బౌలర్ల జాబితాలోకి ఖలీల్ అహ్మద్ ఒకరు చేరాడు. ఎడమ చేతి వాటం కలిగిన ఈ బౌలర్ ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌తో అరంగ్రేటం చేశాడు. అరంగ్రేట సిరీస్‌లోనే తొమ్మిది వికెట్లను సొంతం చేసుకున్నాడు.

'ఖలీల్ భవిష్యత్‌లో మంచి ప్లేయర్‌గా

'ఖలీల్ భవిష్యత్‌లో మంచి ప్లేయర్‌గా

ఇదిలా ఉంటే టీమిండియా వెస్టిండీస్‌తో తలపడిన నాల్గో వన్డేలో అత్యుత్తమ ప్రదర్శన చేసి 3/13స్కోరుతో అదరగొట్టాడు. ఈ క్రమంలో భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్.. ఖలీల్ అహ్మద్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. 'ఖలీల్ భవిష్యత్‌లో మంచి ప్లేయర్‌గా మారతాడు. అతను చాలా చురుకు, నైపుణ్యం బాగున్నాయి. అంతర్జాతీయ స్థాయి ఆటగాడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు.' అని ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ వివరించాడు.

బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసేందుకు

బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసేందుకు

టీమిండియా మేనేజ్‌మెంట్ బౌలింగ్ విభాగాన్ని పటిష్టంగా తయారుచేసేందుకు ఏ విధంగా కృషి చేస్తుందో వెల్లడించాడు. ప్రస్తుత టీమిండియాలో సీమర్స్‌లో ఏ మాత్రం కొదవలేకుండా దూసుకుపోతోంది. శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్ లాంటి ఆటగాళ్లు ఎప్పుడు అవకాశం వస్తుందోననే ఎదురుచూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లందరికంటే ప్రత్యేక గుర్తింపు కోసం భారత్ క్రికెటర్లే ఎక్కువ మ్యాచ్‌లలో పాల్గొంటున్నారు.

బ్యాక్ ఎండ్‌లో కూడా బౌలర్లను

బ్యాక్ ఎండ్‌లో కూడా బౌలర్లను

పేస్ బౌలింగ్ యూనిట్ సృష్టించుకోవడం అవసరమైన పనే. దాంతో పాటుగా బ్యాక్ ఎండ్‌లో కూడా బౌలర్లను ఉంచుకోవాలి. ఏదైనా లాంగ్ ఫార్మాట్‌కి వెళ్లాల్సి ఉంటే అలసిపోయి ఉన్న ప్లేయర్లను మళ్లీ ఆడించలేం. అటువంటి సమయంలో మిగిలిన వాళ్ల సాయంతో మొత్తాన్ని రొటేట్ చేస్తాం.'

మిగతా జట్ల కంటే సుమారు 60 శాతం క్రికెట్‌ను

మిగతా జట్ల కంటే సుమారు 60 శాతం క్రికెట్‌ను

భారత్ ప్రపంచంలోని మిగతా జట్ల కంటే సుమారు 60 శాతం క్రికెట్‌ను ఎక్కువగా ఆడుతోంది. ఈ పరిస్థితుల్లో పని ఒత్తిడిని మేనేజ్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పనే. తొలి సారి మన జట్టు మంచి బౌలింగ్ విభాగంతో కనిపిస్తోంది. దాంతో పాటుగా బెంచ్ విభాగం కూడా అంతే బలంగా ఉంది.'

Story first published: Wednesday, October 31, 2018, 17:09 [IST]
Other articles published on Oct 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X