న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాజీ కెప్టెన్‌తో రోహిత్‌ ఇంటర్వ్యూ.. ఈరోజు సాయంత్రం 4 గంటలకి షెడ్యూల్!!

Kevin Pietersen to Interview Rohit Sharma Today on Social Media

ముంబై: మహమ్మరి కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమే ఆగిపోతే.. క్రీడాలోకం పూర్తి‌గా స్థంభించింది. వైరస్‌ కారణంగా అంతర్జాతీయంగా జరగాల్సిన కొన్ని క్రీడా ఈవెంట్లు రద్దు కాగా.. మరికొన్ని వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎటువంటి క్రికెట్ టోర్నీలు లేకపోవడంతో అన్ని దేశాల ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నారు. అయితే క్రికెటర్లు ఇంట్లో ఖాళీగా ఉంటుండటంతో సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఖాళీ సమయంలో తాము చేస్తున్న పనులు, కుటుంబంతో సరదాగా గడుపుతున్న విషయాలను అభిమానులతో సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

మరో భారత మాజీ ఫుట్‌బాలర్‌ కన్నుమూత!!మరో భారత మాజీ ఫుట్‌బాలర్‌ కన్నుమూత!!

బోర్‌గా ఫీలయ్యాడేమో:

బోర్‌గా ఫీలయ్యాడేమో:

ఎప్పుడూ కామెంట్రీతో బిజీగా ఉండే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా కరోనా సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సందర్భాల్లో ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసే పీటర్సన్.. ప్రస్తుతం ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు జరగకపోవడంతో బోర్‌గా ఫీలయ్యాడేమో. అందుకే గురువారం టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇంటర్వ్యూ చేయనున్నాడు.

రోహిత్ శర్మను ఇంటర్వ్యూ చేస్తున్నా:

రోహిత్ శర్మను ఇంటర్వ్యూ చేస్తున్నా:

రోహిత్ శర్మను ఇంటర్వ్యూ చేయనున్నట్టు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. 'భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4 గంటలకి రోహిత్ శర్మను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అన్ని విషయాలు చర్చిస్తా. అభిమానులు కూడా జాయిన్ కావొచ్చు' అని తెలిపాడు. అయితే ఈ ఇంటర్వ్యూ పలు ప్రశ్నలతో ఆసక్తికరంగా సాగనుందట. మరి మన ఓపెనర్‌కు పీటర్సన్ ఎలాంటి ప్రశ్నలు సంధిస్తాడో చూడాలి.

కరోనాపై హిందీలో సూచనలు:

కరోనాపై హిందీలో సూచనలు:

భారత అభిమానులతో ఇటీవల కెవిన్ పీటర్సన్‌కు మంచి అనుబంధం ఏర్పడింది. మహమ్మారి కరోనా వైరస్ కట్టడి కోసం సామాజిక దూరం పాటించాలని హిందీలో పలు సూచనలు చేశాడు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశంలో 21 రోజుల పాటు విధించిన లాక్‌డౌన్‌కి కూడా పీటర్సన్ తన మద్దతు తెలిపాడు. దీంతో సోషల్ మీడియాలో పీటర్సన్‌పై ప్రశంసలు వర్షం కురిసింది. ఇక శర్మని ఇంటర్వ్యూ చేయడం ద్వారా భారతీయులకి మరింత చేరువకావాలని ఆశిస్తున్నాడు.

ఒకప్పుడు కోహ్లీ నా దగ్గర సలహాలు తీసుకున్నాడు:

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకప్పుడు తన దగ్గర సలహాలు తీసుకున్నాడని ఇటీవలే పీటర్సన్ గుర్తుచేసుకున్నాడు. '2009 ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించా. మ్యాచ్‌లు ఆడడానికి బస్సులో వెళ్లే సమయంలో, ప్రాక్టీస్‌ సమయంలోనూ నా దగ్గర కోహ్లీ బ్యాటింగ్‌ సలహాలు తీసుకునేవాడు. ఆ సమయంలో అతను ఆటను నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఒక ఉత్తమ ఆటగానిగా తయారవ్వాలనే సంకల్పమే కోహ్లీని ఈరోజు ఈ స్థాయికి చేర్చింది. అతను ఇంత గొప్ప క్రికెటర్ అవుతాడని ఆ రోజుల్లో అస్సలు ఊహించలేదు' అని పీటర్సన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, March 26, 2020, 10:51 [IST]
Other articles published on Mar 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X