దిశాపటానీ ట్వీట్‌కు స్పందించిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

Posted By:
Kevin Pietersen responds to Disha Patani’s latest social media update

హైదరాబాద్: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ స్వతహాగా జంతు ప్రేమికుడు. ప్రపంచ వ్యాప్తంగా రైనోస్ సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో వాటిని సంరక్షించే బాధ్యతను కెవిన్ పీటర్సన్ తీసుకున్నాడు. అంతేకాదు ఓ వాలంటీర్‌గా తనకు చేతనైనంత సాయం చేస్తున్నాడు.

తాజాగా, అసోం కజిరంగా నేషనల్‌ పార్క్‌ ప్రకటించిన జంతువుల లెక్కల్లో ఖడ్గమృగాల (రైనోస్‌) సంఖ్య పెరిగింది. ఈ విషయాన్ని అందరూ ఆహ్వానించగా, కెవిన్ పీటర్సన్‌ వాటి సంఖ్య పెరగడంపై సంతోషం వ్యక్తం చేస్తూ హిందీలో ట్వీట్‌ చేశాడు. 'చాలా మంచి వార్త విన్నాను. చాలా సంతోషపడ్డా. భారత్‌ అంటే చాలా ఇష్టం. ఇక్కడ రైనోస్‌ సంఖ్య పెరగడం చాలా సంతోషంగా ఉంది' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

పీటర్సన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియా వైరల్ అయింది. ఇదిలా ఉంటే శుక్రవారం బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ రైనోస్ గురించి చేసిన ట్వీట్‌కు కెవిన్ పీటర్సన్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. దిశా పటానీ తన ట్విట్టర్‌లో 'భూగ్రహంపై జీవించి ఉన్న రెండు వైట్ రైనోస్‌లలో ఇదొకటి. పేరు #Fatu. బెస్ట్ కోసం ఆశిస్తున్నాం' అని ట్వీట్ చేసింది.

దిశా పటానీ ట్వీట్‌కు పీటర్సన్ తనదైన శైలిలో స్పందించాడు. 'అవును, మనమంతా ఆశించాలి' అంటూ ట్వీట్ చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు పీటర్సన్ వీడ్కోలు పలికిన తర్వాత SORAI కోసం పని చేస్తున్నాడు. SORAI అంటే "సేవ్ అవర్ రైనోస్" అన్నమాట. ఈ మధ్య కాలంలో రైనోస్ ఎక్కువగా చనిపోతున్నాయి. ఈ వేపథ్యంలో వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పీటర్సన్ వెల్లడించాడు.

రైనోస్ కాపాడే క్రమంలో పీటర్సన్ కీలక వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఇందులో భాగంగానే దిశాపటానీ ట్వీట్‌కు వెంటనే స్పందించాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) అనంతరం పీటర్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్ తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు ఆడిన పీటర్సన్‌ 2010 టీ20 ప్రపంచకప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు ఇంగ్లాండ్ తరుఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌ రికార్డు నమోదు చేశాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, April 7, 2018, 12:44 [IST]
Other articles published on Apr 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి