న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంత్‌కు పార్థివ్‌ సూచనలు: ఎవరేమనుకున్నా పట్టించుకోకు.. ఆటమీద ధ్యాస పెట్టు!!

Keep away from opinions: Parthiv Patels advice to Rishabh Pant

ముంబై: టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు సీనియర్‌ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ విలువైన సూచనలు చేశాడు. పంత్‌ నీ గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకు, ఆటమీద ధ్యాస పెట్టు అని సూచించాడు. టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చిన పంత్‌ మొదటగా బాగానే ఆకట్టుకున్నా.. ఇటీవలి కాలంలో ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు.

మెక్‌గ్రాత్‌ ఆధ్వర్యంలో శిక్షణ.. ధోనీ తర్వాత రాణిస్తున్న మరో టికెట్ కలెక్టర్‌!!మెక్‌గ్రాత్‌ ఆధ్వర్యంలో శిక్షణ.. ధోనీ తర్వాత రాణిస్తున్న మరో టికెట్ కలెక్టర్‌!!

జట్టులో చోటు కోల్పోయిన పంత్:

జట్టులో చోటు కోల్పోయిన పంత్:

పంత్‌ బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమవడంతో ఇప్పటికే టెస్ట్ జట్టులో చోటు కోల్పోయాడు. మరోవైపు ఇక వికెట్ల వెనుక మోస్తారుగా రాణిస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతనికి ఎందుకు అన్ని అవకాశాలు ఇస్తున్నారు అని మాజీలు టీమిండియా మేనేజ్మెంట్‌ను ప్రశ్నిస్తున్నారు. అయినా యాజమాన్యం అతడికి అండగా ఉంటూ వీలైనన్ని అవకాశాలిస్తూ ప్రోత్సహిస్తోంది.

ఆటపైనే దృష్టి సారించాలి:

ఆటపైనే దృష్టి సారించాలి:

బెంగాల్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌ సందర్భంగా గుజరాత్‌ కెప్టెన్‌ పార్థివ్‌ పటేల్‌ గురువారం మీడియాతో మాట్లాడాడు. 'ఇప్పటి యువ ఆటగాళ్లకు సీనియర్ ఆటగాళ్లతో ఆడడం, డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకునే అవకాశం దక్కుతోంది. అయితే ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో అందరి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతాయి. వాటికి దూరంగా ఉండి, ఆటపైనే దృష్టి సారించాలి' అని తెలిపాడు.

ఎవరేమనుకున్నా పట్టించుకోకు:

ఎవరేమనుకున్నా పట్టించుకోకు:

'టీమిండియాకు ఆడుతుంటే ఒత్తిడి సహజంగా ఉంటుంది. ప్రతి ఆటగాడు ఏదో ఒక దశలో ఒత్తిడిని ఎదుర్కొంటాడు. అలాంటి సందర్భాల్లోనే నైపుణ్యాలు మరింత మెరుగవుతాయి. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పంత్‌ బాగా ఆడాడు. ప్రతికూల పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేస్తే ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా రాణిస్తాడు. పంత్‌ నీ గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకు. ఆటమీద ధ్యాస పెట్టు' అని పార్థివ్‌ సూచించాడు.

అత్యుత్తమ కీపర్‌ సాహా:

అత్యుత్తమ కీపర్‌ సాహా:

'టీమిండియా అత్యుత్తమ టెస్టు కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా అని నా అభిప్రాయం. అతడు క్యాచులు పట్టే విధానం చూస్తే మైదానంలో ఉత్సాహం పెరుగుతుంది. సాహా ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ కీపర్‌' అని పార్థివ్‌ పేర్కొన్నాడు. పార్థివ్‌ టీమిండియా తరపున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. టెస్టులలో 934 పరుగులు, వన్డేలలో 736 పరుగులు, టీ20లలో 36 పరుగులు చేసాడు.

Story first published: Friday, January 3, 2020, 9:51 [IST]
Other articles published on Jan 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X