
హైదరాబాద్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కర్ణాటక-విదర్భ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా ఉంది. ఇరు జట్లకు చెందిన పేసర్లు రాణించడంతో తొలిరోజు 13 వికెట్లు కూలాయి. కర్ణాటక పేస్ బౌలర్ అభిమన్యు మిథున్ (5/45) తో రాణించడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే ఆలౌటైంది.
ఈ మ్యాచ్‌లో విదర్భ టాపార్డర్ పూర్తిగా విఫలం కాగా... మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఆదిత్య సర్వతే (47) జాఫర్ (39) సతీష్ (31) కాస్త ఫరవాలేదనిపించారు. అభిమన్యు మిథున్ (5/45) తో రాణించగా, అతనితో పాటు కెప్టెన్ వినయ్‌కుమార్ (2/36) విజృంభించడంతో తక్కువ స్కోరుకే విదర్భ ఆలౌటైంది.
అనంతం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కర్ణాటక తొలిరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. విదర్భ బౌలర్లలో గుర్బానీ 2 వికెట్లు తీయగా.. ఉమేశ్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక పుణెలో ఢిల్లీతో జరుగుతున్న సెమీస్‌లో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.