న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాధ్యత నాదే.. కానీ నా పరిధిలో లేదు: పాండ్యా-రాహుల్ వివాదంపై కరణ్ జోహార్

Pandya-Rahul Saga : Karan Johar Apologises To Hardik Pandya & K L Rahul | Oneindia Telugu
Karan Johar On Hardik Pandya-KL Rahul Row: I Feel Responsible But Its Beyond My Control

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌ల కెరీర్‌లు సందిగ్ధంలో పడటానికి కారణమైన 'కాఫీ విత్ కరణ్' టాక్ షో హోస్ట్ కరణ్ జోహా ఎట్టకేలకు ఈ వివాదంపై పెదవి విప్పాడు. వాళ్లకీ పరిస్థితి రావడానికి తానే బాధ్యుడినని, అయితే ప్రస్తుతం ఆ అంశం తన పరిధిలో లేదని కరణ్ జోహార్ అన్నాడు.

<strong>న్యూజిలాండ్ పర్యటనలో భారత్ బోణీ: తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో విజయం</strong>న్యూజిలాండ్ పర్యటనలో భారత్ బోణీ: తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో విజయం

కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ కరణ్' టాక్ షోకి ఇటీవల హాజరైన హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్.. ఈ షోలో కరణ్ జోహార్ సరదాగా అడిగిన ప్రశ్నలకి కొంటెగా సమాధానం చెప్పి వారి క్రికెట్ కెరీర్‌ను చిక్కుల్లో పడేసుకున్నారు. ఈ షోలో మహిళలపై పాండ్యా చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

పాండ్యా-రాహుల్‌పై విమర్శలు

పాండ్యా-రాహుల్‌పై విమర్శలు

యువతకి ఆదర్శంగా నిలవాల్సిన క్రికెటర్లు ఇలా అసభ్యకరంగా మాట్లాడటంతో వారిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో వీరిద్దరినీ తాత్కాలికంగా సస్పెండ్ చేసిన బీసీసీఐ విచారణకు ఆదేశించింది. దీంతో తాజాగా ఈ మొత్తం వివాదానికి కారకుడైన కరణ్ జోహార్ స్పందించాడు.

నా పరిధిలో లేదు

నా పరిధిలో లేదు

"నా షోకి వచ్చే సెలబ్రిటీలందరికీ సాధారణంగా అలాంటి ప్రశ్నలే వేస్తుంటాను. అందులో దీపికా పదుకొణె, అలియా భట్ తదితర హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే, ఆ ప్రశ్నలకి వారు ఎలాంటి సమాధానాలు చెప్తారు అనేది మాత్రం నా పరిధిలో లేని అంశం. కానీ.. వాళ్లు నా షోలో ఉన్నారు, కాబట్టి దానికి బాధ్యుడిని నేనే. వాళ్లను నేనే అతిథులుగా ఆహ్వానించాను" అని చెప్పుకొచ్చాడు.

నేనే బాధ్యత వహించాలి

నేనే బాధ్యత వహించాలి

"ఆ షోలో ఏం జరిగినా నేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాళ్లకు జరిగిన నష్టం చూసి నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఆ నష్టాన్ని ఎలా పూడ్చాలా అని ఆలోచించాను. కానీ నా మాట వినేవాళ్లు ఎవరు? ఇప్పుడు ఈ హార్దిక్, రాహుల్ వివాదం నా పరిధిలో లేదు" అని కరణ్ జోహార్ వెల్లడించాడు. పాండ్యా-రాహుల్‌లపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ ఎపిసోడ్‌ని ఇంటర్నెట్‌ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, January 23, 2019, 17:05 [IST]
Other articles published on Jan 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X