న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శతాబ్దానికి ఒక్కరే పుడతారు: కపిల్‌తో పాండ్యాకు పోలికపై గవాస్కర్

By Nageshwara Rao
Kapil is once-in-a century cricketer, dont compare Pandya with him: Gavaskar

హైదరాబాద్: కపిల్‌ దేవ్‌ లాంటి లెజెండరీ ఆల్‌రౌండర్‌ శతాబ్దానికి ఒక్కరే పుడతారని, అలాంటి ఆటగాడితో హార్దిక్‌ పాండ్యాను పోల్చవద్దని భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. గత కొద్దిరోజులుగా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కపిల్‌తో పోల్చుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పాండ్యానేకాదు ఏ క్రికెటర్‌నూ కపిల్‌ దేవ్‌తో పోల్చలేమని సునీల్ గవాస్కర్ స్పష్టం చేశాడు. ఆజ్ తక్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో గవాస్కర్ మాట్లాడుతూ "కపిల్‌దేవ్‌ను ఎవరితోనూ పోల్చకూడదు. అతను కేవలం ఒక తరానికి మాత్రమే పరిమితమయ్యే ఆటగాడు కాదు. సర్ డాన్ బ్రాడ్‌మాన్, సచిన్ టెండూల్కర్‌లా శతాబ్దానికి ఒక్క ఆటగాడు" అని పేర్కొన్నాడు.

Kapil is once-in-a century cricketer, dont compare Pandya with him: Gavaskar

సుధీర్ఘ ఫార్మాట్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ శైలిపై గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ధావన్ 26, 13 పరుగులతో పేలవ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధావన్ ఆటతీరుపై గవాస్కర్ స్పందించాడు.

"టెస్టులకు తగ్గట్లుగా తన ఆటతీరు మార్చుకోవడానికి ధావన్ ఇష్టపడటం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్ మాదిరిగానే టెస్టు ఫార్మాట్‌లోనూ ఆడుతున్నాడు. వన్డేల్లో స్లిప్‌లో ఫీల్డర్లు ఉండరు కనుక అతను ఇలాంటి షాట్లు అక్కడ ఆడితే ఎలాంటి సమస్య ఉండదు. అవి నేరుగా బౌండరీ వెళ్తాయి. అయితే టెస్టుల్లో బంతి బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకుంటే వికెట్ కోల్పోవాల్సిందే" అని గవాస్కర్ అన్నాడు.

Story first published: Wednesday, August 8, 2018, 13:29 [IST]
Other articles published on Aug 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X