న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్ కంటే.. అదే నా జీవితంలో గొప్ప విషయం: కపిల్ ‌దేవ్

Kapil Dev says When I played for India is bigger than winning the 1983 World Cup

ఢిల్లీ: 1983లో వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడటం కంటే దేశం తరఫున తొలిసారి ప్రాతినిధ్యం వహించడమే తన జీవితంలో గొప్ప విషయమని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ ‌దేవ్‌ అన్నారు. ఇక తమ బలబలాల్ని అర్థం చేసుకుని ఆస్ట్రేలియా పిచ్‌లపై బంతులు సంధించాలని టీమిండియా పేసర్లకు సూచించారు. సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా కంగారూల గడ్డపై ఉన్న విషయం తెలిసిందే. వన్డే, టీ20 సిరీస్‌ను ముగించుకుని.. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతోంది. గురువారం (డిసెంబరు 17) నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. రేపు అడిలైడ్ వేదికగా తొలి డే/నైట్‌ టెస్టు ప్రారంభం కానుంది.

పేస్ బలాల్ని అర్థం చేసుకుని

పేస్ బలాల్ని అర్థం చేసుకుని

తాజాగా కపిల్ ‌దేవ్ మాట్లాడుతూ... 'మన ఫాస్ట్ ‌బౌలర్లకు ఆసీస్‌ పిచ్‌లపై ఆడిన అనుభవం ఎక్కువగా లేదు. అక్కడ ఎక్కువగా ఆడిన ఇషాంత్ శర్మ దూరమయ్యాడు. అక్కడ బౌన్స్ లభిస్తుందని షార్ట్‌ బంతులు విసరడానికి మన బౌలర్లు ప్రయత్నిస్తుంటారు. అయితే మన పేస్ బలాల్ని అర్థం చేసుకుని బౌలింగ్ చేయాలి. మనకి ప్రస్తుతం ఉత్తమ బౌలింగ్ దళం ఉంది. కానీ మన బౌలర్ల కంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లకి అక్కడి పరిస్థితులపై ఎంతో అవగాహన ఉంది. వారు ఆధిపత్యం చెలాయించడానికి చూస్తారు' అని అన్నారు.

ఆస్ట్రేలియాకే ఎక్కువ అవకాశాలు

ఆస్ట్రేలియాకే ఎక్కువ అవకాశాలు

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న తొలి డే/నైట్‌ టెస్టులో ఆస్ట్రేలియాకే విజయావకశాలు ఎక్కువగా ఉన్నాయని కపిల్ ‌దేవ్ అభిప్రాయపడ్డారు. 'కచ్చితంగా ఆస్ట్రేలియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారు స్వదేశంలో ఆడుతున్నారు. అదే భారత్‌లో ఆడితే టీమిండియా 80 శాతం విజయం సాధిస్తుందని కచ్చితంగా భావిస్తా. అంతేగాక ఆస్ట్రేలియా ఎన్నో డే/నైట్ టెస్టులు ఆడింది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు' అని టీమిండియా మాజీ సారథి పేర్కొన్నారు.

తొలిరోజే నా జీవితంలో గొప్ప విషయం

తొలిరోజే నా జీవితంలో గొప్ప విషయం

1983లో ప్రపంచకప్‌ను ముద్దాడటం కంటే దేశం తరఫున తొలిసారి ప్రాతినిధ్యం వహించడమే తన జీవితంలో గొప్ప విషయమని కపిల్ ‌దేవ్‌ అన్నారు. 'దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన తొలిరోజే నా జీవితంలో గొప్ప విషయం. ప్రపంచకప్‌ను అందుకున్న క్షణాల కంటే వెయ్యి రెట్లు గొప్పది. ఎందుకంటే దేశం కోసం ఆడాలనేది నా కల. దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఎంతో గర్వపడతా' అని కపిల్ చెప్పుకొచ్చారు. 1978లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన కపిల్ ‌దేవ్ 1983లో దేశానికి తొలి ప్రపంచకప్‌ను అందించారు. మెగా టోర్నీలో అండర్‌డాగ్స్‌లో బరిలోకి దిగిన టీమిండియా ఛాంపియన్‌గా నిలిచింది. ట్రోఫీని అందుకోవడంలో సారథిగా, ఆల్‌రౌండర్‌గా‌ కపిల్‌ కీలకపాత్ర పోషించారు.

టోక్యో ఒలింపిక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న జపనీయులు!!

Story first published: Wednesday, December 16, 2020, 13:29 [IST]
Other articles published on Dec 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X