న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాతో టెస్టు: కేన్ విలియమ్సన్‌కు గాయం, ఆసుపత్రికి తరలింపు!

 Kane Williamson Taken to Hospital for Scans on Injured Left Shoulder

హైదరాబాద్: వెల్లింగ్టన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ మూడో రోజు ఆటలో భాగంగా కేన్ విలియమ్సన్‌ ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో విలియమ్సన్ ఎడమ భుజానికి గాయమైంది.

ఆఖరి బంతికి సిక్స్ బాదిన బుమ్రా: మురిసిపోయిన కోహ్లీ (వీడియో)ఆఖరి బంతికి సిక్స్ బాదిన బుమ్రా: మురిసిపోయిన కోహ్లీ (వీడియో)

అయితే, చిన్నపాటి గాయమని భావించిన విలియమ్సన్ ఆటను కొనసాగించాడు. ఇక, నాలుగో రోజైన సోమవారం ఆటలో భాగంగా విలియమ్సన్ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో గాయం తిరగబెట్టింది. ఆ నొప్పి భరించలేక మైదానంలో విలవిలాడాడు. ఫిజియోలు పలుమార్లు అతడికి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ నొప్పి తగ్గలేదు.

దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతడి స్థానంలో టిమ్ సౌథీని ఫీల్డ్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ మ్యాచ్‌లో నొప్పితో విలవిలలాడుతూనే విలియమ్సన్(105 బంతుల్లో 74; 11 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక, రాస్‌టేలర్‌ డబుల్‌ సెంచరీ సాధించగా.. హెన్రీ నికోలస్‌ సెంచరీ బాదడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 432/6 వద్ద డిక్లేర్డ్‌ చేసింది.

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. అంతకుముందు బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ 141 పరుగుల వెనుకబడి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి.

Story first published: Monday, March 11, 2019, 14:00 [IST]
Other articles published on Mar 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X