న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్రేత్‌వైట్‌..బ్రూట‌ల్ ఇన్నింగ్‌! బ‌ట్‌..!

Kane Williamson Stars As New Zealand Survive Carlos Brathwaite Scare To Win West Indies Thriller

మాంఛెస్ట‌ర్‌: కార్లొస్ బ్రేత్‌వైట్‌. వెస్టిండీస్ ఆల్ రౌండ‌ర్‌. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌క‌ప్‌లో మారుమోగుతున్న పేరు. అప్పుడెప్పుడో టీ20 ప్రపంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో అసాధార‌ణంగా చెల‌రేగి.. ఇంగ్లండ్ నుంచి విజ‌యాన్ని లాగేసుకున్న త‌రువాత ఇన్నాళ్లకు మ‌రోసారి బ్రేత్‌వైట్ పేరు క్రికెట్ ప్రపంచంలో అంద‌రి నోళ్ల‌లో నానుతోంది. గెలుపుపై ఏ మాత్రం ఆశ‌లు లేని స్థితి నుంచి త‌న జ‌ట్టును ఫీనిక్స్ ప‌క్షిలా విజ‌యం అంచుల దాకా తీసుకెళ్లాడు. విజ‌యాన్ని అందించ‌లేకపోయాడు. అయిన‌ప్ప‌టికీ- అత‌ని పోరాట ప‌టిమ‌ను ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు ప్ర‌త్య‌ర్థులు కూడా.

ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఇంగ్లండ్ మాంఛెస్ట‌ర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో శ‌నివారం న్యూజీలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ విజ‌యం ముంగిట బోల్తా కొట్టింది. అయిదు ప‌రుగుల తేడాతొ ఓట‌మి పాలైంది. ప్ర‌పంచ‌క‌ప్ నుంచి నిష్క్ర‌మించే అవ‌కాశాల‌కు మ‌రింత ద‌గ్గ‌రైంది. ఈ విజ‌యంతో న్యూజీలాండ్ జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానాన్ని మ‌రింత ప‌టిష్టం చేసుకుంది. న్యూజీలాండ్ ఇప్ప‌టిదాకా మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడ‌గా.. అయిదింటిలో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. భార‌త్‌తో జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం వ‌ల్ల ర‌ద్ద‌యిన విష‌యం తెలిసిందే.

 ల‌క్ష్యం 292 ప‌రుగులు..

ల‌క్ష్యం 292 ప‌రుగులు..

మాంఛెస్ట‌ర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జ‌ట్టు ఇన్నింగ్ అత్యంత పేల‌వంగా ఆరంభ‌మైంది. ఓపెన‌ర్ గ‌ప్టిల్ ఇన్నింగ్ తొలి బంతికే అవుట్ అయ్యాడు. స్కోరుబోర్డుపై ఒక్క ప‌రుగు కూడా చేర‌క‌ముందే వికెట్ కోల్పోయింది న్యూజీలాండ్‌. కోట్రెల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడత‌ను. మ‌రో ఓపెన‌ర్ కొలిన్ మున్రో ప‌రిస్థ‌తీ అంతే. ఎదుర్కొన్న తొలి బంతికే అదే కోట్రెల్ బౌలింగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సున్నాకే పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. ఇక ఇన్నింగ్‌ను తీర్చిదిద్దే బాధ్య‌త‌ను కేప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ త‌న భుజాల‌పై వేసుకున్నాడు. మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేల‌ర్‌తో క‌లిసి మూడో వికెట్‌కు 160 పరుగుల భాగ‌స్వామ్యాన్ని అందించాడు. ఈ క్ర‌మంలో 154 బంతుల్లో 148 ప‌రుగులు చేశాడు విలియ‌మ్స‌న్‌.

 రాస్ టేల‌ర్‌..టైల‌ర్ మేడ్‌!

రాస్ టేల‌ర్‌..టైల‌ర్ మేడ్‌!

దూకుడైన ఆట‌తీరుకు పెట్టింది పేరైన రాస్ టేల‌ర్ కుదురుగా ఆడాడు. భారీ షాట్లకు పోలేదు. కేప్టెన్‌తో క‌లిసి బాధ్య‌తాయుత‌మైన ఇన్నింగ్ ఆడాడు. 95 బంతుల్లో ఏడు ఫోర్ల‌తో 69 ప‌రుగులు చేశాడు. అత‌ని ఇన్నింగ్‌లో ఒక్క సిక్స‌ర్ కూడా న‌మోదు కాలేదంటే ఈ పించ్ హిట్ట‌ర్ ఎంత జాగ్ర‌త్త‌గా ఆడాడో అర్థం చేసుకోవ‌చ్చు. జ‌ట్టు స్కోరు 167 ప‌రుగుల వ‌ద్ద రాస్ టేల‌ర్ అవుట్ అయ్యాడు. క్రిస్ గేల్ బౌలింగ్‌లో హోల్డ‌ర్‌కు క్యాచ్ ఇచ్చి తిరుగుముఖం ప‌ట్టాడు. రాస్ టేల‌ర్ త‌రువాత బ్యాటింగ్‌కు వ‌చ్చిన కివీస్ ఆట‌గాళ్లెవరూ చెప్పుకోద‌గ్గ స్కోరు చేయ‌లేక‌పోయారు. టేల‌ర్ అవుటైన త‌రువాత బ్యాటింగ్‌కు దిగిన టామ్ టామ్ లాథ‌మ్ 16 బంతుల్లో 12 ప‌రుగులు, జేమ్స్ నీష‌మ్ 23 బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్స‌ర్‌తో 28 ప‌రుగులు, కొలిన్ గ్రాండ్‌హోమ్ 6 బంతుల్లో ఒక సిక్స‌ర్‌, ఒక ఫోర్‌తో 16 ప‌రుగులు చేశారు. మొత్తం 50 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 291 ప‌రుగులను చేసింది కివీస్ జ‌ట్టు.

వ‌రుస‌గా వికెట్లు ప‌డుతున్నా..

వ‌రుస‌గా వికెట్లు ప‌డుతున్నా..

ఒక‌వంక వరుస‌గా వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికీ.. నిబ్బ‌రాన్ని కోల్పోలేదు విలియ‌మ్స‌న్‌. చ‌క్క‌టి ఇన్నింగ్ ఆడాడు. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస‌గా రెండో సెంచ‌ర‌నీ పూర్తి చేసుకున్నాడు. వ‌న్‌డౌన్‌గా, జ‌ట్టు స్కోరు ఏడు ప‌రుగుల వ‌ద్ద క్రీజులోకి వ‌చ్చిన విలియ‌మ్సన్‌.. అయిదో వికెట్‌గా జ‌ట్టు స్కోరు 251 ప‌రుగుల వ‌ద్ద అవుట్ అయ్యాడు. కోట్రెల్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ షై హోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టెయిలెండ‌ర్లు కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌, మిఛెల్ శాట్న‌ర్ చివ‌ర్లో మెరుపులు మెరిపించ‌డంతో కివీస్ జ‌ట్టు భారీ స్కోరును సాధించ‌గ‌లిగింది.

క్రిస్ గేల్‌.. తొలిసారిగా

క్రిస్ గేల్‌.. తొలిసారిగా

నిజానికి- వెస్టిండీస్ ఇన్నింగ్ కూడా కివీస్‌లాగే పేల‌వంగా ఆరంభ‌మైంది. జ‌ట్టు స్కోరు మూడు ప‌రుగుల వ‌ద్ద ఓపెన‌ర్ షై హోప్ అవుట్ అయ్యాడు. 20 ప‌రుగుల వ‌ద్ద నికొల‌స్ పూర‌న్ వికెట్‌ను కోల్పోయింది విండీస్‌. మ‌రో ఓపెన‌ర్ క్రిస్ గేల్ మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ షిమ్రాన్ హెట్‌మెయిర్‌తో క‌లిసి ఇన్నింగ్‌ను నిల‌బెట్టాడు. మూడో వికెట్‌కు 122 ప‌రుగుల విలువైన భాగ‌స్వామ్యాన్ని అందించాడు. ఈ క్ర‌మంలో వారిద్ద‌రూ అర్థ‌సెంచ‌రీల‌ను పూర్తి చేసుకున్నారు. జ‌ట్టు స్కోరు 142 ప‌రుగుల వ‌ద్ద హెట్‌మెయిర్ అవుట్ అయ్యాడు. 45 బంతుల్లో ఒక సిక్స‌ర్‌, ఎనిమిది బౌండ‌రీల‌తో 54 ప‌రుగులు చేశాడు. ఫెర్గూస‌న్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రిస్ గేల్ 84 బంతుల్లో ఆరు సిక్స‌ర్లు ఎనిమిది బౌండ‌రీల‌తో 87 ప‌రుగులు చేశాడు. అత‌ని ఇన్నింగ్ నుంచి తొలిసారిగా ఓ హాఫ్ సెంచ‌రీ జాలువారింది ఈ ప్రపంచ‌క‌ప్‌లో.

 బ్రేత్‌వైట్‌.. బ్రీత్ హోల్డింగ్ ఇన్నింగ్‌

బ్రేత్‌వైట్‌.. బ్రీత్ హోల్డింగ్ ఇన్నింగ్‌

బ్రేత్‌వైట్ బ్యాటింగ్‌కు వ‌చ్చేట‌ప్ప‌టికీ.. విండీస్ ప‌రిస్థితి ఏ మాత్రం ఆశాజ‌న‌కంగా లేదు. క‌నీసం గెలుపు అంచుల దాకా వెళ్తుంద‌ని కూడా ఎవ‌రూ ఊహించ‌లేదు. 167 పరుగుల‌కు ఏడు వికెట్ల‌ను కోల్పోయిన విండీస్‌.. విజ‌యానికి అయిదు ప‌రుగుల దూరంలో నిలిచిందంటే- కేవ‌లం బ్రేత్‌వైట్ వ‌ల్లే సాధ్య‌మైంది. టెయిలెండ‌ర్ బ్యాట్స్‌మెన్లు కీమ‌ర్ రోచ్, కోట్రెల్‌, థామస్‌ల స‌హ‌కారంతో చెల‌రేగిపోయాడత‌ను. అసాధార‌ణ ఇన్నింగ్ ఆడాడు. 82 బంతుల్లో అయిదు సిక్స‌ర్లు, తొమ్మిది ఫోర్ల‌తో 101 ప‌రుగులు చేశాడు. ఓ భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి అవుట్ అయ్యాడు. క్రీజులోనే కూల‌బ‌డిపోయాడు. 48వ ఓవ‌ర్ చివ‌రి బంతికి నీష‌మ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించాడు. బౌండ‌రీ లైన్ వ‌ద్ద బౌల్ట్ క్యాచ్ ప‌ట్ట‌డంతో అత‌ని పోరు ముగిసింది. ఆరు బంతుల్లో అయిదు ప‌రుగులు చేయాల్సిన ద‌శ‌లో బ్రేత్‌వైట్ భారీ షాట్ ఆడటంతో విండీస్ ప‌రాజ‌యం పాలైంది. మొత్తం 49 ఓవ‌ర్ల‌లో 286 ప‌రుగులు చేసింది విండీస్‌.

Story first published: Sunday, June 23, 2019, 9:21 [IST]
Other articles published on Jun 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X