న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: ఈ సీజన్‌లో విలియమ్సన్‌ తొలిసారి ఇలా (వీడియో)

By Nageshwara Rao
Kane Williamson duck out - caught by Ravichandran Ashwin

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ డకౌట్‌గా నిష్క్రమించాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

ఈ మ్యాచ్‌లో మూడు బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్‌.. అంకిత్ రాజ్‌పుత్ వేసిన మొదటి ఓవర్‌లో కెప్టెన్ కేన్ విలియమ్‌సన్(0) అశ్విన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో విలియమ్సన్‌ మొదటిసారి డకౌట్‌గా పెవిలియన్‌ చేరిన అపప్రథను మూటగట్టుకున్నాడు.

దీంతో సన్‌రైజర్స్ 1 వికెట్ నష్టానికి 1 పరుగు చేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుని పంజాబ్ పేసర్ అంకిత్ రాజ్‌పుత్ తన అద్భుతమైన బౌలింగ్‌తో వణికించాడు. విలియమ్సన్ ఔటైన తర్వాత మూడో ఓవర్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (11), ఐదో ఓవర్‌లో సాహా (6)ని ఔట్ చేశాడు.

ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బౌన్సర్ రూపంలో వచ్చిన బంతుల్ని హిట్ చేయబోయి ముగ్గురూ క్యాచ్‌ల రూపంలోనే ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ప్రస్తుతం 10 ఓవర్లకు గాను సన్రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది.

Story first published: Thursday, April 26, 2018, 21:02 [IST]
Other articles published on Apr 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X