కగిసో రబాడకు మరో వార్నింగ్, నెలకోసారి ఇలా..

Posted By:
Kagiso Rabada charged with an additional Level I offence

హైదరాబాద్: కగిసో రబాడకు మరో వార్నింగ్ ఎదురైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ని ఉద్దేశపూర్వకంగా ఢీకొన్నాడంటూ పేర్కొన్నాడు డివిలియర్స్. ఈ విషయమై దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడకి సహచర క్రికెటర్ ఏబీ డివిలియర్స్ వార్నింగ్ ఇచ్చాడు. మైదానంలో హద్దులెరిగి ప్రవర్తించాలని సూచించాడు.

ఫోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో రబాడ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటైన స్మిత్.. డీఆర్‌ఎస్ కోరేందుకు సిద్ధమవుతుండగా అతడ్ని భుజంతో రబాడ ఢీకొట్టాడు. ఇలా మైదానంలో క్రమశిక్షణ తప్పిన ఆటగాడికి ఐసీసీ భారీ జరిమానాతో పాటు.. అతని ఖాతాలో డీమెరిట్ పాయింట్లను చేర్చే అవకాశముంది. మంగళవారం ఈ టెస్టు ముగిసిన అనంతరం మ్యాచ్ రిఫరీతో చర్చించి ఐసీసీ చర్యలు తీసుకోనుంది.

రబాడని నియంత్రించే బాధ్యతను తీసుకోవాలి

రబాడని నియంత్రించే బాధ్యతను తీసుకోవాలి

‘తప్పిదాల నుంచి రబాడ పాఠాలు నేర్చుకోవాలి. మైదానంలో వికెట్ తీసిన సమయంలో హద్దుల్లో సంబరాలు చేసుకుంటే మంచిది. స్మిత్‌ను భుజంతో ఢీకొట్టిన ఘటనలో వాస్తవాలేంటో నాకు తెలియదు. ఫాస్ట్ బౌలర్లలో ఆమాత్రం దూకుడు ఉండటం సహజమే. కానీ.. అది పరిమితులకి లోబడి ఉండాలి. మైదానంలో రబాడని నియంత్రించే బాధ్యతను సీనియర్ క్రికెటర్లు తీసుకోవాలి. వికెట్ తీసిన వెంటనే అతడి చుట్టూ ఉండి.. అతను హుందాగా మెలిగేలా చూడాలి' అని డివిలియర్స్ సూచించాడు.

విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్‌లను సైతం కవ్వించి:

విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్‌లను సైతం కవ్వించి:

ఇటీవల భారత్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లోనూ విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్‌తో కవ్వింపు చర్యలకి దిగిన రబాడ.. గత ఏడాది రెండు సందర్భాల్లో హద్దులు మీరి ప్రవర్తించి ఐసీసీతో మొట్టికాయలు వేయించుకున్నాడు. ఇలా ఇప్పటికే ఐసీసీ నియమావళిని అతిక్రమించి నాలుగు సార్లు దెబ్బతిన్నాడు రబాడ.

ఫిబ్రవరి 2017లో:

ఫిబ్రవరి 2017లో:

శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లాను రెచ్చగొట్టే విధంగా సంజ్ఞలు చేశాడు. దానికి గాను మూడు డీ మెరిట్ పాయింట్లతో పాటు మ్యాచ్ ఫీజులో 50% కోతకు గురైయ్యాడు.

 జూలై 2017లో:

జూలై 2017లో:

అసభ్య పదజాలం, బూతులను తిట్టి ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఆగ్రహానికి బలైయ్యాడు. దీనికి గాను మ్యాచ్ ఫీజులో ఒక డి మెరిట్ పాయింట్‌తో పాటు 15% మ్యాచ్ ఫీజు కోతపడింది. అంతేగాక ఒక టెస్టు మ్యాచ్ నిషేదం సైతం శిక్షగా అనుభవించాడు.

 ఫిబ్రవరి 2018లో:

ఫిబ్రవరి 2018లో:

భారత బ్యాటింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను సైతం వెక్కిరించే విధంగా అసభ్య పదజాలం వాడి ఐసీసీ చేతికి దొరికిపోయాడు. దీనికిగాను ఒక డి మెరిట్ పాయింట్‌తో పాటు మ్యాచ్ ఫీజులో 15% శాతం కోతపడింది.

 మార్చి 2018లో:

మార్చి 2018లో:

ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ మ్యాచ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడా అనే సందేహంలో రివ్యూ కోరేందుకు వెళ్తుండగా అతని భుజానికి కావాలనే తగిలాడు. అదే టెస్టులో సహ క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్‌పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఈ విషయంపై విచారణ కొనసాగుతోంది.

Story first published: Monday, March 12, 2018, 16:37 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి