న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా కొత్త కోచ్‌గా జస్టిన్‌ లాంగర్‌: ప్రత్యేకతలివే

By Nageshwara Rao
 Justin Langer is named as Australia’s new head coach

హైదరాబాద్: బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ప్రపంచ దేశాల్లో ఆస్ట్రేలియా పేరు మసకబారింది. ఈ బాల్‌ ట్యాంపరింగ్‌ మరకల నుంచి ఆస్ట్రేలియా జట్టును బయటపడేసేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆ జట్టుకు హెడ్ కోచ్‌గా జస్టిన్‌ లాంగర్‌ను ఎంపిక చేసినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డు ప్రకటించింది.

బాల్‌ టాంపరింగ్‌ వివాదం కారణంగా డారెన్‌ లీమన్‌ కోచ్‌ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అతని స్థానంలో జస్టిన్ లాంగర్‌ను నియమించింది. 47 ఏళ్ల ఈ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రెండు యాషెస్‌ సిరీస్‌లు కైవసం చేసుకోవటంలో ఆసీస్‌ తరపున ముఖ్య భూమిక పోషించారు. ఒక వరల్డ్‌ కప్‌, టీ20 వరల్డ్‌ కప్‌ సాధనలో జట్టు భాగస్వామిగా ఉన్నారు.

ఆస్ట్రేలియా హెడ్ కోచ్‌గా జస్టిన్ లాంగర్

ఆస్ట్రేలియా హెడ్ కోచ్‌గా జస్టిన్ లాంగర్

ప్రస్తుతం జస్టిన్ లాంగర్ వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా, పెర్త్‌ స్కాచర్స్‌ జట్లకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహారిస్తున్నాడు. ‘నాలుగేళ్ల పాటు పురుషుల ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందించేందుకు జస్టిన్‌ లాంగర్‌ను నియమించాం. మే 22న ఆయన బాధ్యతలు చేపడతారు. ఆయన హయాంలో ఆసీస్‌ రెండు యాషెస్‌ సిరీస్‌లతో పాటు వన్డే, టీ20 ప్రపంచకప్‌లు ఆడనుంది' అని సీఏ ఓ ప్రకటనలో పేర్కొంది.

 ఇక నుంచి ఆటగాళ్లు అప్రమత్తంగా ఉంటారు

ఇక నుంచి ఆటగాళ్లు అప్రమత్తంగా ఉంటారు

ఈ సందర్భంగా లాంగర్ మాట్లాడుతూ 'ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాలని ఎంతో ఆత్రుతగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా జట్టు నుంచి అభిమానులు ఎంతో కొంత ఆశిస్తుంటారు. ఇక నుంచి ఆటగాళ్లు అప్రమత్తంగా ఉంటారని, మైదానంలో మర్యాదగా ప్రవర్తిస్తారని అనుకుంటున్నా' అని అన్నాడు.

'కొన్ని సవాళ్లు ఎదుర్కొవాలి. ఆటలో ప్రత్యర్థులు ఒకరినొకరు

'కొన్ని సవాళ్లు ఎదుర్కొవాలి. ఆటలో ప్రత్యర్థులు ఒకరినొకరు

గౌరవించుకోవటం మంచి సంప్రదాయం. ప్రతిభ గల ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ గర్వపడేలా పని చేస్తా. నా దృష్టిలో ప్రపంచంలో గౌరవాన్ని మించిది ఏది లేదు. నిషేధం ముగిశాక ముగ్గురు ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రావటాన్ని తాను స్వాగతిస్తాను' అని అన్నాడు.

ఆసీస్ తరుపున 105 టెస్టులాడిన జస్టిన్ లాంగర్

ఆసీస్ తరుపున 105 టెస్టులాడిన జస్టిన్ లాంగర్

1993 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన లాంగర్‌ 105 టెస్టులాడాడు. 45.27 సగటున 7,696 పరుగులు సాధించాడు. ఇందులో 23 సెంచరీలు ఉన్నాయి. బాల్‌ టాంపరింగ్ వివాదం నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, కామెరూన్‌ బెన్‌క్రాఫ్ట్‌లపై సీఏ ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

డారెన్‌ లీమన్ రాజీనామాతో ఈ నిర్ణయం

డారెన్‌ లీమన్ రాజీనామాతో ఈ నిర్ణయం

ఆ తర్వాత కోచ్‌ డారెన్‌ లీమన్ కూడా తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఆపై కొత్త కోచ్‌ కోసం పలువురి పేర్లను సీఏ ప్రతిపాదించగా బోర్డులో రాజకీయాలు మొదలయ్యాయి. కోచ్ వ్యవహారం క్రికెట్ ఆస్ట్రేలియాకు తలనొప్పిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వివాదరహితుడిగా పేరున్న జస్టిన్ లాంగర్‌ను నియమించటమే మంచిదని సీఏ భావించి ఈ నిర్ణయం తీసుకుంది.

Story first published: Thursday, May 3, 2018, 14:16 [IST]
Other articles published on May 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X