న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup Rewind 2019: ఎవరికీ సాధ్యంకాని రికార్డును నెలకొల్పిన రోహిత్ శర్మ!!

July 6, 2019: Rohit Sharma Becomes Only Batsman to Score Five Centuries in a World Cup

హైదరాబాద్: ఇంగ్లండ్ వేదికగా 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ పరుగుల సునామీ సృష్టించాడు. విభిన్న పిచ్‌లు, భిన్న పరిస్థితుల్లో ఒకే తరహా ప్రదర్శనతో టోర్నీ ఆసాంతం ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో 2019 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో హిట్‌మ్యాన్‌ అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాదు ఐదు శతకాలతో చెలరేగాడు. దీంతో రోహిత్ ప్రపంచకప్‌ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గా ఎవరికీ సాధ్యంకాని చరిత్ర సృష్టించాడు.

శ్రీలంకపై శతకం:

సరిగ్గా ఏడాది క్రితం ఇదేరోజు‌ రోహిత్ శర్మ ఐసీసీ ప్రపంచకప్ 2019లో తన ఐదో సెంచరీ సాధించాడు. ఈ సెంచరీని శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో బాదాడు. రోహిత్ 94 బంతుల్లో 14 ఫోర్లు, రెండు సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. దీంతో ఒకే టోర్నమెంట్‌ ఎడిషన్లో ఐదు సెంచరీలు సాధించిన మొదటి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 648 పరుగులతో 2019 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రోహిత్.. కేవలం తొమ్మిది మ్యాచ్‌ల్లో 81.00 సగటుతో పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకపై సెంచరీలు చేశాడు.

సంగక్కర రికార్డు‌ బద్దలు:

సంగక్కర రికార్డు‌ బద్దలు:

లీగ్ మ్యాచ్‌లలో భాగంగా శ్రీలంకపై టీమిండియా 265 పరుగులు చేసింది. అందులో ఓపెనర్‌ రోహిత్ శర్మ 103 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 111 పరుగులతో సెంచరీ చేశాడు. వీరిద్దరి ప్రదర్శనతో శ్రీలంకపై 43.3 ఓవర్లలో ఏడు వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ సెంచరీతో ప్రపంచకప్‌ ఒకే ఎడిషన్‌లో లంక కెప్టెన్ కుమార సంగక్కర నాలుగు సెంచరీల రికార్డును రోహిత్‌ బద్దలు కొట్టాడు. 2015లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్‌లో లంక మాజీ బ్యాట్స్‌మన్‌ నాలుగు శతకాలతో చెలరేగిపోయాడు. ఇక ప్రపంచకప్‌లలో మొత్తం ఆరు సెంచరీలతో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డుకు కూడా చేరువయ్యాడు. సచిన్ తన కెరీర్ ఆసాంతం ఆడిన అన్ని ప్రపంచకప్‌లలో కలిపి ఆరు సెంచరీలు చేయగా.. రెండో ప్రపంచకప్‌లు మాత్రమే ఆడిన రోహిత్ ఆరో సెంచరీని చేశాడు.

గోల్డెన్‌ బ్యాట్‌:

గోల్డెన్‌ బ్యాట్‌:

ప్రపంచకప్‌-2019లో ఓపెనర్ రోహిత్‌ శర్మ గోల్డెన్‌ బ్యాట్‌ను అందుకున్నాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్‌ గోల్డెన్‌ బ్యాట్‌ను దక్కించుకున్నాడు. 9 మ్యాచ్‌లలో ఐదు శతకాలు సాధించిన రోహిత్‌.. 81 సగటుతో 648 పరుగులు చేసాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ (647) రెండో స్థానంలో, బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్ షకిబ్‌ అల్‌ హసన్‌ (606) మూడో స్థానంలో నిలిచారు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (576), ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌ జో రూట్ (556) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

మూడు ఫార్మాట్లలో కలిపి 39 శతకాలు:

ప్రస్తుతం టీమిండియా పరిమిత ఓవర్ల జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ‌ ఇప్పటివరకు 32 టెస్టులు, 224 వన్డేలు, 108 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 14,029 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 39 శతకాలు బాదాడు. 33 ఏళ్ల రోహిత్‌ వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఐపీఎల్ టోర్నీలో కూడా ఓ సెంచరీ చేసాడు.

కరోనా‌తో మతిపోయిందా ఏంటి?.. 'ఆర్ యు ఓకే' అఫ్రిదీ!!

Story first published: Monday, July 6, 2020, 12:40 [IST]
Other articles published on Jul 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X