న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోచ్ మాత్రమే కాదు.. అప్పుడే ద్రవిడ్‌కు చెప్పా: జాన్‌ రైట్‌పై సౌరవ్ గంగూలీ

John Wright was more of a friend than coach, says Sourav Ganguly

హైదరాబాద్: టీమిండియా మాజీ కోచ్‌ జాన్‌రైట్‌పై టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. జాన్‌రైట్‌ తనకు ఇష్టమైన కోచ్‌ అని అంతకంటే ఎక్కువగా అతడు ఓ మంచి స్నేహితుడని తెలిపాడు. ప్రస్తుతం జరగుతున్న ప్రపంచకప్‌లో గంగూలీ కామెంటటేర్‌గా వ్వవహారిస్తోన్న సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

గురువారం భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన నేపథ్యంలో జాన్‌రైట్‌తో కలసి తన అనుభవాలను పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఐసీసీ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో సౌరవ్ గంగూలీ పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు.

"నా తొలి విదేశీ శిక్షకుడు.. ఫేవరెట్‌ కోచ్‌ జాన్‌ రైట్‌. 2000వ సంవత్సరంలో జాన్‌రైట్‌ను తొలిసారి కెంట్‌(ఇంగ్లండ్‌)లో చూశాను. రాహుల్‌ ద్రవిడ్‌ నా దగ్గరికొచ్చి 'ఇతడే మన కోచ్‌' అని పరిచయం చేశాడు. 'అతడితో కలిసి ఇష్టంగా పనిచేస్తా'నని అప్పుడే ద్రవిడ్‌కు చెప్పా. మా మధ్య మంచి సంబంధాలున్నాయి" అని గంగూలీ తెలిపాడు.

"అన్నట్లే మా మధ్య కోచ్, ఆటగాడిలా కాకుండా ఒక మంచి స్నేహబంధం ఏర్పడింది. రైట్ కోచ్‌గా ఉన్నప్పుడు 2003 ప్రపంచకప్ టోర్నీతో పాటు పలు టోర్నీలో భారత జట్టు చిరస్మరణీయ విజయాలందుకుంది. అందుకు రైట్‌ కారణం. రోజులు గడుస్తున్నాకొద్దీ మంచి స్నేహితులుగా మారాం. మేమిద్దరం ఆట పరంగా ఒకర్నొకరం చాలా బాగా అర్థం చేసుకున్నాం. అతడు కోచ్‌గా కంటే మిత్రుడిగానే ఎక్కువ" అని గంగూలీ పేర్కొన్నాడు.

కాగా, న్యూజిలాండ్‌కు చెందిన జాన్‌రైట్‌ భారత జట్టుకు తొలి విదేశీ కోచ్‌. సౌరవ్ కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న తొలి నాళ్లలో 2000-2005 మధ్యకాలంలో జాన్‌ రైట్ టీమిండియాకు కోచ్‌గా పనిచేశాడు. జాన్‌ రైట్‌ శిక్షణలోనే భారత్‌ 2003 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు చేరుకుంది. 2002 నాట్‌వెస్ట్‌ సిరీ స్‌ను కైవసం చేసుకుంది.

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై టెస్ట్‌ సిరీస్‌ను డ్రాగా ముగించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై వన్డే సిరీస్‌నూ కైవసం చేసుకుంది. అయితే, తాను భారత జట్టుకు కోచ్‌గా ఉంటానని ఏనాడూ అనుకోలేదని జాన్ రైట్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, June 15, 2019, 12:46 [IST]
Other articles published on Jun 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X