న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ashes 2021: డకౌట్స్ కెప్టెన్‌గా జోరూట్ చెత్త రికార్డు..!

 Joe Root Worst Record In Ashes 2021: Most Test Ducks As Captain Of England

సిడ్నీ: వరుస ఓటములతో ఇప్పటికే యాషెస్ సిరీస్‌ను చేజార్చుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్.. బ్యాట్స్‌మన్‌గా చెత్తరికార్డును మూటగట్టుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో జోరూట్(0) డకౌట్‌గా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో అత్యధికసార్లు డకౌట్ అయిన రెండో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌గా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇక యాషెస్ సిరీస్‌లో ఎక్కువసార్లు డకౌట్ అయిన కెప్టెన్‌గానూ అప్రతిష్టను మూటగట్టకున్నాడు.

టెస్ట్ కెరీర్‌లో కెప్టెన్‌గా జోరూట్ ఇప్పటి వరకు 7 సార్లు డకౌటవ్వగా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ 8 సార్లతో జోరూట్ కన్నా ముందున్నాడు. ఇక ఆండ్రూ స్ట్రాస్ 6 సార్లు డకౌటై ఈ ఇద్దరి తర్వాతి స్థానంలో నిలిచాడు. యాషెస్ సిరీస్‌లో డాన్ బ్రాడ్‌మన్‌తో సమంగా జోరూట్ ఐదు సార్లు డకౌటయ్యాడు.

గతేడాది జోరూట్ కెప్టెన్‌గా విఫలమైనా.. బ్యాట్స్‌మన్‌గా దుమ్మురేపాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2021లో 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన జో రూట్ 29 ఇన్నింగ్స్‌లో 61 స‌గ‌టుతో 1,708 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 సెంచ‌రీలు, 4 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 228.

ఇక 2022లో మాత్రం శుభారంభం అందుకోలేకపోయాడు. ఈ ఏడాది ఆడిన ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కుక్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌ను 416/8 స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది. ఆ జట్టులో ఉస్మాన్ ఖావాజా(260 బంతుల్లో 13 ఫోర్లతో 137) సెంచరీతో చెలరేగగా.. స్టీవ్ స్మిత్(141 బంతుల్లో 5 ఫోర్లతో 67) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లకు 258 రన్స్ చేసింది. క్రీజులో సెంచరీ హీరో జానీ బెయిర్ స్టో (140 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 103 బ్యాటింగ్), జాక్ లీచ్(4 బ్యాటింగ్) ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 158 పరుగుల వెనుకంజలో ఉంది.

Story first published: Friday, January 7, 2022, 16:42 [IST]
Other articles published on Jan 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X