న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENGvsPAK: బాల్డ్ ట్యాంపరింగ్ చేసిన జో రూట్.. వైరల్ అవుతున్న వీడియో..!

Joe Root tries to shine the ball on jack leach head video goes viral

క్రికెట్ అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్. అది ఆటగాళ్ల బ్యాటింగ్ అయినా, బౌలంగ్ అయినా, మైదానంలో వాళ్లు చేసే ఏ పని అయినా ఎంటర్‌టైనింగ్‌గానే ఉంటుంది. ఇదే విషయం మరోసారి రుజువైంది. ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ తీవ్రమైన విమర్శలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సంగతి తెలిసిందే. మరీ దారుణమైన ఫ్లాట్ పిచ్ వేశారని, దీని వల్ల టెస్టు క్రికెట్ చచ్చిపోతుందని క్రీడాభిమానులు కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై మండిపడ్డారు.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ చేసిన ఒక పని ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తమ జట్టు బౌలింగ్ చేస్తుండగా రూట్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. విల్ జాక్స్ తన ఓవర్ ముగించాడు. అప్పటికి 72 ఓవర్లు ముగిశాయి. ఓలీ రాబిన్సన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో బంతిని ఒక వైపు షైన్ చేయడం క్రికెటర్లకు అలవాటు. బంతి తమ చేతికి వచ్చిన ప్రతిసారీ ఉమ్మితో ఒక వైపు షైన్ చేసేవారు. అయితే కరోనా తర్వాత ఉమ్మి వాడకంపై ఐసీసీ నిషేధం విధించింది.

ఉమ్మి వాడకంపై ఐసీసీ నిషేధంతో చాలా మంది ఆటగాళ్లు చెమటతో బంతిని తుడుస్తున్నారు. రూట్ కూడా పాకిస్తాన్ మ్యాచ్‌లో అదే చేశాడు. అయితే అతను తన చెమటతో బంతిని తుడవలేదు. అటుగా వచ్చిన జాక్ లీచ్ తలపై ఉన్న టోపీ తీసేసి, అతని బుర్రకేసి బంతిని రుద్దుతూ షైన్ చేయడానికి ప్రయత్నించాడు. ఇది చూసిన కామెంటేటర్లు నవ్వలేక చచ్చారు. ఇదో అత్యంత తెలివైన పని అంటూ నవ్వుకున్నారు. ఇలా జాక్ లీచ్ తలపై ఉన్న చెమటతో బంతిని రూట్ షైన్ చేస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ఈ వీడియోను చూసి 'ఇది బాల్డ్ ట్యాంపరింగ్' అంటూ జోకులు పేలుస్తున్నారు.

Story first published: Saturday, December 3, 2022, 18:10 [IST]
Other articles published on Dec 3, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X