న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENGvsPAK: ఏంటిది సామీ.. నువ్వు ఒకలా ఆడవా..? షాకుల మీద షాకులు ఇస్తున్న రూట్..!

Joe Root tries to play left hander to face leg spin

ఇంగ్లండ్ టెస్టు స్పెషలిస్టు జో రూట్ మైదానంలో ఉన్నంతసేపూ ఏదో ఒక విచిత్రమైన పని చేస్తూనే ఉంటాడు. అది చూసిన అభిమానులకు ఏం అర్థం కాదు. కొన్ని రోజుల క్రితం ఇంగ్లండ్‌లో ఆడుతూ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో తన బ్యాటును నేలపై నిలబెట్టాడు రూట్. అది చూసిన వాళ్లంతా నోరెళ్లబెట్టారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వంటి వాళ్లు కూడా అలా చేయడానికి ట్రై చేసినా కుదర్లేదు.

పాక్ టెస్టులో రూట్ వేషాలు..

ఇప్పుడు పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లు రావల్పిండి వేదికగా తొలి టెస్టు ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో బంతిని షైన్ చేయడానికి జాక్ లీచ్ బుర్రపై బంతి రుద్దాడు రూట్. గతంలో బంతిని షైన్ చేయడానికి ఉమ్మి వాడేవారు. కానీ కరోనా కారణంగా ఉమ్మి ఉపయోగించడాన్ని ఐసీసీ నిషేధించింది. అందుకే ఆటగాళ్లు చెమట వాడుతున్నారు. లీచ్ బుర్రపై చెమట ఉందని, అతని టోపీ తీసి మరీ రూట్ ఇలా అతని బుర్రకేసి బంతిని రుద్దాడు. అది చూసిన కామెంటేటర్లు, ఫ్యాన్లు నవ్వుకోలేక చచ్చారు. ఇలాంటి ఆలోచనలు రూట్‌కు మాత్రమే వస్తాయని, మిగతా వారికి రావని కామెంట్లు చేశాడు.

రూట్ కొత్త ప్లాన్..

ఇదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రేక్షకులకు రూట్ మరో షాకిచ్చాడు. పాక్ లెగ్ స్పిన్నర్ జాహిద్ మహమూద్ బౌలింగ్ ఎదుర్కోవడానికి ఎవరూ ఊహించని విధానాన్ని ఎంచుకున్నాడు. స్వతహాగా రైట్ హ్యాండర్ అయిన అతను.. సడెన్‌గా మహూమూద్ బౌలింగ్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అవతారం ఎత్తాడు. మహమూద్ వేసిన బంతిని స్వీప్ చేసి సింగిల్ తీశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రూట్ వేసిన ప్లాన్‌లో తప్పేం లేదు. ఎందుకంటే లెగ్ స్పిన్నర్లు వేసే బంతులు కుడి చేతివాటం బ్యాటర్ల నుంచి దూరంగా వెళ్తుంటాయి. వాటిని ఆడే క్రమంలో ఎడ్జ్ తీసుకొని అవుటయ్యే ప్రమాదం ఉంది. అదే లెఫ్ట్ హ్యాండర్లకు అయితే ఆ బంతి వారి కాళ్ల మీదకు వస్తుంది. దాన్ని సులభంగా లెగ్ సైడ్ ఆడుకోవచ్చు. అందుకే రూట్ ఈ పద్ధతిని ఎంచుకున్నాడు. అయితే కేవలం ఒక్క బంతిని మాత్రమే రూట్ ఇలా ఎదుర్కొన్నాడు.

రివర్స్ స్వీప్‌తో బౌండరీ..

ఆ మరుసటి బంతికి మళ్లీ తన పాత పద్ధతిలో కుడి చేతివాటం బ్యాటర్‌లా నిలబడ్డాడు. అయితే చివరి నిమిషంలో రివర్స్ స్వీప్ ఆడి బౌండరీ సాధించాడు. ఇలా రూట్ ఆడటం చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఏదో ఒకలా బ్యాటింగ్ చెయ్యి సామీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 'అందరిలా ఆడటం రూట్ వల్ల కాదా? ఏదో ఒకటి ఇలా స్పెషల్‌గా చేయాల్సిందేనా?' అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ జట్టు 80/3 స్కోరుతో నిలిచింది. ఆ జట్టు గెలవాలంటే ఐదో రోజున 263 పరుగులు చేయాలి.

Story first published: Monday, December 5, 2022, 7:25 [IST]
Other articles published on Dec 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X