న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్ ఓటమి: వాన్ వ్యాఖ్యలు ఎంతో బాధించాయన్న రూట్

By Nageshwara Rao

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. నాటింగ్హామ్ వేదికగా జరిగిన ఈ టెస్టులో ఇంగ్లాండ్ 340 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమిపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.

యాషెస్ సిరిస్ గెలిచిన కెప్టెన్‌గా మైకేల్ వాన్‌కు ఎంతో పేరుంది. మైకేల్ వాన్ ప్రస్తుతం బీబీసీ రేడియోలో వ్యాఖ్యాతగా వ్యవహారిస్తున్నాడు. రెండో టెస్టు ఘోరో ఓటమి అనంతరం మైకేల్ వాన్ మాట్లాడుతూ "కనీసం పోరాడటంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. అసలు ఆట మీద గౌరవం లేకపోతేనే ఈ తరహా ప్రదర్శనలు వస్తాయి. మా జట్టు ఆటకు కనీస గౌరవం ఇవ్వలేదు" అని తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.

ట్వంటీ20 గేమ్ మాదిరి ఆడారు

ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీరు క్షమించరానిదంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించాడు. టెస్టు క్రికెట్‌ను ట్వంటీ20 గేమ్ మాదిరి ఆడారని అన్నాడు. నాలుగో రోజైన సోమవారం 474 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 44.2 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌటైంది.

ఏ ఒక్క బ్యాట్స్ మెన్ కూడా అర్ధసెంచరీ చేయలేదు

ఏ ఒక్క బ్యాట్స్ మెన్ కూడా అర్ధసెంచరీ చేయలేదు

ఏ ఒక్క ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ కూడా అర్ధసెంచరీ చేయలేకపోయాడు. అలెస్టర్‌ కుక్‌ చేసిన 42 పరుగులే అత్యధిక స్కోరు కావడం విశేషం. 1/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌, క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. ఏ దశలోనూ విజయం దిశగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కొనసాగలేదు.

11 పరుగులకే చివరి ఐదు వికెట్లు

11 పరుగులకే చివరి ఐదు వికెట్లు

11 పరుగులకే చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. పరుగుల పరంగా చూస్తే దక్షిణాఫ్రికాకు ఇది నాలుగో అతిపెద్ద విజయం. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 96.2 ఓవర్లు ఆడి 335 పరుగులు చేయగా, ఇంగ్లాండ్‌ 205 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 343 పరుగులు చేసింది.

వాన్ వ్యాఖ్యలు బాధించాయన్న జో రూట్

దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ 1-1తో సమమైంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు పట్ల మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు తమను ఎంతగానో బాధించాయని కెప్టెన్ జో రూట్ పేర్కొన్నాడు. 'ఆటలో గెలుపు, ఓటములు సహజమే. ఆటపై గౌరవం లేదని వాన్ వ్యాఖ్యానించడం సరికాదు. వాన్ నుంచి ఆ రకమైన వ్యాఖ్యలను అస్సలు ఊహించలేదు. దురదృష్టవశాత్తూ రెండో టెస్టులో మా ఆట పేలవంగా ఉన్న మాట వాస్తవమే. దీన్ని సరిచేసుకుని ముందుకు సాగుతాం. ఇక సిరీస్‌ను సాధించడంపైనే దృష్టి సారించాం' అని రూట్ పేర్నొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X