న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జో రూట్ రూపంలో ఇంగ్లాండ్‌కు కొత్త స్పిన్నర్ దొరికాడా?

By Nageshwara Rao
Joe Root serves reminder of his bowling prowess as England wrestle with lack of spin options for India Tests

హైదరాబాద్: సుదీర్ఘ సిరిస్ కోసం కోహ్లీసేన ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 1 నుంచి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా బర్మింగ్ హామ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో కోహ్లీసేన తొలి టెస్టులో తలపడనుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరిస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న ఇంగ్లాండ్ టెస్టు సిరిస్‌లో కూడా కొత్త వ్యూహాలతో బరిలోకి దిగనుంది.

అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌‌లకు చోటు

అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌‌లకు చోటు

టీమిండియాతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు టెస్టు జట్టు ప్రకటించకపోయినా.. ఇప్పటికే ఫాస్ట్‌ బౌలర్లు జేమ్స్‌ అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ జట్టులో దాదాపు తుది జట్టులో చోటు దక్కించుకున్నట్టే. తాజాగా ఈ పేసర్లకు మరో స్పిన్ సంచలనం జట్టుతో జత కలిసింది. ఈ స్పిన్ సంచలనం మరెవరో కాదు కెప్టెన్ జో రూట్.

బ్యాట్స్‌మెన్‌గా కెరీర్‌ ఆరంభించిన జో రూట్‌

బ్యాట్స్‌మెన్‌గా కెరీర్‌ ఆరంభించిన జో రూట్‌

జో రూట్ బ్యాట్స్‌మన్ కదా. బౌలింగ్ చేయడం ఏంటని అనుకుంటున్నారా? బ్యాట్స్‌మెన్‌గా కెరీర్‌ ఆరంభించిన జో రూట్‌ ఆఫ్ స్పిన్నర్ కూడా. తాజాగా కౌంటీల్లో జో రూట్ తనలోని బౌలర్‌ను మరోసారి నిద్రలేపాడు. టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరిస్ ముగియడంతో ఇంగ్లాండ్‌ క్రికెటర్లు ప్రస్తుతం కౌంటీల్లో ఆడుతున్న సంగతి తెలిసిందే.

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన జో రూట్

ఈ క్రమంలో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా యార్క్‌షైర్‌, లాంక్‌షైర్‌ జట్ల మధ్య మంగళవారం మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో యార్క్‌షైర్‌ జట్టుకు ఆడుతోన్న జో రూట్‌ ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని కౌంటీ ఛాంపియన్‌షిప్‌ నిర్వాహాకులు ట్విటర్‌‌లో అభిమానులతో పంచుకున్నారు.

 5 పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీసిన జో రూట్

5 పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీసిన జో రూట్

"యార్క్‌షైర్‌ ఆటగాడు రూట్‌ అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు ఇవి.. కేవలం 5 పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. ఫలితంగా ఆ జట్టు 118పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది" అంటూ ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ వీడియోని వీక్షించిన క్రికెట్ అభిమానులు జో రూట్‌తో జాగ్రత్త. అతను బ్యాట్‌తోనే కాదు. బంతితోనూ రాణించగలడు అని కామెంట్లు పెడుతున్నారు.

Story first published: Wednesday, July 25, 2018, 13:26 [IST]
Other articles published on Jul 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X