న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టార్క్ 140 కిలోమీటర్ల బంతి.. రూట్ గార్డ్ రెండు ముక్కలు (వీడియో)

Joe Root protective box left in tatters after Mitchell Starc’s 140 kmph ball

మాంచెస్టర్: ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య యాషెస్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 383 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆతిథ్య ఇంగ్లండ్‌ 197 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ 2-1తో సిరీస్ ఆధిక్యంలో నిలవడంతో పాటు ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ను నిలబెట్టుకుంది.

<strong>వెస్టిండీస్ వన్డే, టీ20 కెప్టెన్‌గా కీర‌న్ పొలార్డ్!!</strong>వెస్టిండీస్ వన్డే, టీ20 కెప్టెన్‌గా కీర‌న్ పొలార్డ్!!

స్టార్క్ బంతికి బెంబేలెత్తాడు:

స్టార్క్ బంతికి బెంబేలెత్తాడు:

అయితే నాలుగో టెస్టులో ఓ ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో పదునైన బంతులను విసురుతాడు. ఈ బంతులకు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అబ్డామినల్ గార్డ్ (ఉదర రక్షక కవచం) రెండు ముక్కలైంది. తొలి ఇన్నింగ్స్‌లో పలుమార్లు స్టార్క్, కమ్మిన్స్ విసిరిన బంతులు రూట్ సున్నిత భాగాలను తాకాయి. ఈ క్రమంలో స్టార్క్ వేసిన బంతికి రూట్ బెంబేలెత్తాడు.

గార్డ్ రెండు ముక్కలు:

స్టార్క్ వేసిన ఓ బంతి 140 కిలోమీటర్ల వేగంతో వచ్చి రూట్ పొట్ట కింది భాగంలో (గజ్జల్లో) తాకింది. దీంతో రూట్ క్రీజులో మోకాళ్లపై నిలబడి విలవిల్లాడు. నొప్పి తీవ్రంగా ఉన్నా.. రూట్ మాత్రం బయటపడలేదు. అయితే అక్కడ రక్షణ కోసం పెట్టుకున్న గార్డ్ మాత్రం రెండు ముక్కలైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రూట్ తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగులు చేసాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు.

ఆసీస్‌దే యాషెస్‌:

ఆసీస్‌దే యాషెస్‌:

ఓవర్‌నైట్ స్కోరు 18/2 వద్ద ఐదో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మ్యాచ్‌ను డ్రా చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. అయితే కమిన్స్‌, హాజెల్‌వుడ్‌ విజృంభించడంతో ఆసీస్ ఆలౌట్ అయింది. డబుల్‌ సెంచరీతో అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చిన మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది. గత సిరీస్‌ను ఆసీస్ గెల్చుకోవడంతో.. గురువారం నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్టులో ఓడినా సిరీస్ 2-2తో సమం అవుతుంది. దీంతో ట్రోఫీ ఆసీస్ వద్దనే ఉంటుంది.

Story first published: Monday, September 9, 2019, 13:43 [IST]
Other articles published on Sep 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X