న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Joe Root Magic with Bat : ఇదేందిది ఇది మేం సూడలే.. రూట్ మ్యాజిక్ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..!

Joe Root holding the bat without any support, video goes viral

లార్డ్స్‌‌లో ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో జో రూట్ (115 పరుగులు 170బంతుల్లో, 12ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో ఇంగ్లాండ్.. న్యూజిలాండ్ మీద 5వికెట్ల తేడాతో గెలుపొందింది. జోరూట్ కడవరకు క్రీజులో ఉండి సెంచరీతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా జోరూట్ ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో 10000పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు ఇంగ్లాండ్ బ్యాటర్ అలెస్టర్ కుక్ ఈ ఘనత సాధించాడు.

అలాగే అత్యంత తక్కువ వయసులో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా కూడా జో రూట్ నిలిచిన సంగతి తెలిసిందే. 118 మ్యాచ్‌లలో 218 ఇన్నింగ్స్‌లలో 10వేల పరుగులు సాధించిన రూట్ ఇంగ్లాండ్ తరఫున ఫాస్టెస్ట్ 10000పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఇకపోతే తొలి టెస్ట్‌లో రూట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో బ్యాట్‌ను ఎలాంటి సపోర్ట్ లేకుండా నిటారుగా నిలబెట్టి మ్యాజిక్ చేశాడు. ఇది కెమెరా కంటికి చిక్కింది. దీంతో ఈ వీడియో నెట్టింటా తెగ వైరలవుతోంది.

నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా..

నాలుగో రోజు రూట్ బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో ఈ ఆసక్తికర విషయం జరిగింది. ఇక 87పరుగుల వద్ద రూట్ ఉన్నప్పుడు అతను నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్నాడు. అప్పుడు న్యూజిలాండ్ బౌలర్ కైల్ జేమీసన్ బౌలింగ్‌కు దిగాడు. ఇకపోతే కైల్ జేమీసన్ రనప్ వీడియోలో.. రూట్ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో బ్యాట్‌ను నేలపై ఎలాంటి ఆధారం లేకుండా నిలబెట్టాడు. ఇక జేమీసన్ వికెట్ల దగ్గరికి రాగా బ్యాట్ పట్టుకున్నాడు. అసలు బ్యాట్ ఎలాంటి సపోర్ట్ లేకుండా అలా నిటారుగా రూట్ ఎలా నిలబెట్టాడో చాలా మందికి అర్థం కాలేదు.

అడుగున ఫ్లాట్‌గా ఉండడంతోనే

ఇక రూట్‌కు మ్యాజిక్ కూడా తెలుసేమో అన్నట్లు కొందరు నెటిజన్లు ఈ వీడియో మీద కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇందులో ఉన్న రీజన్ ఏంటంటే.. సాధారణంగా రూట్.. బ్యాట్ వెనకవైపు కాస్త్ మందమైన చార ఒకటి ఉండడంతో పాటు.. అడుగుభాగం చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. అందువల్ల కాస్త బౌలింగ్ ఎండ్‌లో అనువైన చిన్న పూడిక ఉన్న అందులో పెడితే ఆగుతుంది. రూట్ అదే చేశాడు. బౌలర్ల ఫుట్ స్టెప్పులకు పూడిక ఏర్పడిన చోట తన బ్యాట్ పెట్టాడు. దాంతో బ్యాట్ అలా నిటారుగా నిలబడింది.

రూట్ ట్యాలెంటెడ్ అని తెలుసు కానీ మరీ ఇంతలా?

రూట్ ట్యాలెంటెడ్ అని తెలుసు కానీ మరీ ఇంతలా?

ఇకపోతే ఓ అభిమాని ట్విట్టర్లో ఈ వీడియో పోస్టు చేస్తూ.. రూట్ చాలా ప్రతిభావంతుడని నాకు తెలుసు కానీ.. ఇలాంటి మ్యాజిక్ చేసేటంత ప్రతిభావంతుడని మాత్రం అనుకోలేదు. అసలు ఏమిటీ మాయాజాలం? అంటూ సంభ్రమంగా క్యాప్షన్ ఇచ్చాడు. మరో ట్విట్టర్ యూజర్ సైతం ఈ వీడియో పోస్ట్ చేస్తూ.. అసలు బ్యాట్ నిజంగా అలా నిటారుగా నిలబడిందా? నమ్మలేకపోతున్నా. మ్యాజిషియన్ కన్నా జోరూట్ గొప్పోడిలా ఉన్నాడు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ వీడియో మీద నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రూట్ బ్యాట్‌లో మ్యాగ్నెట్ ఉందేమో అని ఒకరు, న్యూ బ్యాలెన్స్ అనే కొత్త రకం బ్యాట్ రూట్ పట్టుకొచ్చాడేమో అంటూ మరొకరు కామెంట్ చేశారు.

Story first published: Monday, June 6, 2022, 15:00 [IST]
Other articles published on Jun 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X