న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England 5th test : ఇంగ్లాండ్‌కు గెలుపు ‘రూట్’.. ఇండియాకు ‘బెయిర్ స్ట్రో’క్, సిరీస్ సమం

Joe Root and Jonny Bairstow Usual Winning Knocks Helped to England to level the Series

పటౌడీ ట్రోఫీలోని రీషెడ్యూల్ చేసి అయిదో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో విధించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ అలవోకగా ఛేదించింది. ఇంగ్లాండ్ అయిదో రోజు తొలి సెషన్లోనే గెలుపు లాంఛనాన్ని ముగించింది. ఓవర్ నైట్ స్కోరు 259పరుగులతో ప్రారంభించిన ఇంగ్లాండ్.. ఎప్పటిలాగే తన ఫియర్ లెస్ క్రికెట్‌తో గెలుపు ఒళ్లో వాలింది.

72పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బెయిర్ స్టో, 76పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో జోరూట్ బ్యాటింగ్ ప్రారంభించి.. ఇండియా బౌలర్లను సునాయసంగా ఎదుర్కొని మిగతా 119పరుగులను ఆడుతూ పాడుతూ చేసేశారు. ఫలితంగా 76.4ఓవర్లలో 3వవికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ 378పరుగుల టార్గెట్ ఛేదించి.. 7వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా ఈ సిరీస్ 2-2తో సమమైంది.

భారత బౌలర్ల చెత్త ప్రదర్శన

భారత బౌలర్ల చెత్త ప్రదర్శన

ఇక అయిదో రోజు కూడా భారత బౌలర్ల చెత్త ప్రదర్శన కొనసాగింది. ఇక ఈ క్రమంలో జానీ బెయిర్ స్టో (114పరుగులు 145బంతుల్లో 15ఫోర్లు, 1 సిక్సర్), జో రూట్ (142పరుగులు 173బంతుల్లో 19ఫోర్లు 1సిక్సర్) తమ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. క్రీజులో విజయవంతంగా నిలదొక్కుకున్న రూట్.. ఇంగ్లాండ్‌కు గెలుపు రూట్ వేయగా.. విహారి 14పరుగుల వద్ద బెయిర్ స్టో క్యాచ్ మిస్ చేయడంతో.. ఇండియాకు తన సెంచరీ స్ట్రోక్ ఏంటో జానీ చూపించాడు. ఏదేమైనా ఫియర్ లెస్ క్రికెట్‌తో అత్యధ్భుతంగా ఛేజింగ్ చేస్తూ.. ఇంగ్లాండ్ వరుసగా టెస్టుల్లో తమ హవా కొనసాగిస్తోంది.

నాలుగో రోజే గెలుపు ఖాయమైంది

నాలుగో రోజే గెలుపు ఖాయమైంది

ఇక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3వికెట్లకు 259 పరుగులు చేసి దాదాపు గెలుపును ఖాయం చేసుకుంది. ఓపెనర్లు అలెక్స్ లీస్(65 బంతుల్లో 8 ఫోర్లతో 56), జాక్ క్రాలీ(76 బంతుల్లో 7 ఫోర్లు 46) 107పరుగుల భాగస్వామ్యాన్ని అందించి మ్యాచ్‌ను తమ వైపునకు కాస్త తిప్పేశారు. ఇక తర్వాత జానీ బెయిర్ స్టో, జోరూట్ క్రీజులో మొండిగా నిలుచుని చెలరేగారు. వీరిద్దరు నాలుగో రోజు ఆట ముగిసేవరకు క్రీజులో ఉండి భారత బౌలర్లను ఆటాడుకున్నారు. ఇక భారత బౌలింగ్లో కెప్టెన్ బుమ్రా (2/52) మినహా మరెవరూ ఒక్క వికెట్ తీయలేకపోవడం గమనార్హం. వికెట్ సైతం పూర్తిగా ఫ్లాట్‌గా మారడం ఇంగ్లాండ్ బ్యాటర్లకు కలిసొచ్చింది.

సంక్షిప్త స్కోర్లు..

సంక్షిప్త స్కోర్లు..

భారత్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్(రిషభ్ పంత్ 146, రవీంద్రజడేజా 104, జేమ్స్ అండర్సన్ 5/60)

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్(జానీ బెయిర్ స్టో 106, సామ్ బిల్లింగ్స్ 36, మహమ్మద్ సిరాజ్ 4/66)

భారత్ రెండో ఇన్నింగ్స్ 245 ఆలౌట్ ( పుజారా 66, రిషభ్ పంత్ 57, బెన్ స్టోక్స్ 4/33)

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 76.4 ఓవర్లలో 378/3 (బెయిర్ స్టో 114నాటౌట్, జోరూట్ 142నాటౌట్)

Story first published: Tuesday, July 5, 2022, 17:01 [IST]
Other articles published on Jul 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X