న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హమ్మయ్య.. భారత్‌లో తొలి వికెట్ తీసిన బుమ్రా! చెన్నై టెస్టులో రెండు అరుదైన రికార్డులు!

Jasprit Bumrah finally takes a wicket at home soil in Chennai Test
IND Vs ENG 1st Test: 'Debutant' Bumrah Takes First Test Wicket On Home Soil sets THIS new record

చెన్నై: 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన టీమిండియా పేస్ ‌బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా.. భారత్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లండ్ మధ్య శుక్రవారం చెన్నైలోని చెపాక్ మైదానంలో తొలి టెస్టు ప్రారంభం అయింది. ఈ మ్యాచులో చోటు దక్కినందుకున్న బుమ్రా.. తన టెస్ట్ కెరీర్‌లో సొంతగడ్డపై తోలి మ్యాచ్ ఆడుతున్నాడు. అంతేకాదు తొలి వికెట్ కూడా పడగొట్టాడు. ఇప్పటివరకు బుమ్రా భారత్ తరపున 17 టెస్టులకు ప్రాతినిధ్యం వహించగా.. అవన్నీ విదేశాల్లోనే ఆడడం విశేషం.

డారెన్ గంగా సరసన బుమ్రా

డారెన్ గంగా సరసన బుమ్రా

భారత్‌లో తొలి టెస్టు ఆడడానికి పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు మూడేళ్లు పట్టింది. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్ట్ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన అతడు ఎట్టకేలకు స్వదేశంలో తొలి టెస్టు ఆడుతున్నాడు. దీంతో సొంత‌గ‌డ్డ‌పై అరంగేట్రం చేసే ముందు విదేశాల్లో అత్య‌ధిక టెస్టులు ఆడిన ప్లేయ‌ర్‌గా బుమ్రా నిలిచాడు. బుమ్రా కంటే ముందు వెస్టిండీస్ ప్లేయ‌ర్ డారెన్ గంగా కూడా స్వ‌దేశం బ‌య‌ట 17 టెస్టులు ఆడాడు. వీళ్ల త‌ర్వాతి స్థానంలో టీమిండియా మాజీ పేస‌ర్ జ‌వ‌గ‌ళ్ శ్రీనాథ్ (12 టెస్టులు) ఉన్నాడు. ఆర్పీ సింగ్‌ 11, సచిన్‌ టెండూల్కర్ 10 టెస్టులు ఆడారు.

మూడో బౌలర్‌గా రికార్డు

మూడో బౌలర్‌గా రికార్డు

17 టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా 79 వికెట్లు తీసుకున్నాడు. ఇది కూడా ఓ రికార్డే. స్వ‌దేశంలో తొలి టెస్ట్ ఆడే ముందు ఇన్ని వికెట్లు తీసిన తొలి బౌల‌ర్ బుమ్రానే. అత‌ని కంటే ముందు విండీస్ స్పిన్న‌ర్ ఆల్ఫ్ వాలెంటైన్ స్వ‌దేశంలో త‌న తొలి మ్యాచ్‌కు ముందు 65 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా ఇప్పటివరకు 17 టెస్టుల్లో 21 సగటుతో 79 వికెట్లు తీశాడు. ఇందులో 5 సార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అంతేగాక అరంగేట్రం చేసిన ఏడాదిలోనే 8 మ్యాచ్‌ల్లో 48 వికెట్లతో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న బుమ్రా.. ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డుకెక్కాడు.

సిబ్లీ అర్ధ శతకం

సిబ్లీ అర్ధ శతకం

తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ తొలి రోజు టీ విరామ సమయానికి 57 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓపెనర్‌ డొమినిక్‌ సిబ్లీ (53) అర్ధ శతకంతో దూసుకెళుతుండగా.. కెప్టెన్‌ జో రూట్ ‌(45) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. లంచ్ సమయానికి 63 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో బరిలోకి దిగిన రూట్‌.. సిబ్లీతో కలిసి విలువైన పరుగుల భాగస్వామ్యం (77) జోడించాడు. ఈ క్రమంలోనే జట్టును భారీ స్కోర్‌ దిశగా తీసుకెళుతున్నాడు.

నెట్ బౌలర్, స్టాండ్-బై బౌలర్‌కు అవకాశాలు వచ్చాయి.. కుల్దీప్‌ చేసిన తప్పేంటి? కోహ్లీ నీకు అర్ధమవుతుందా!

Story first published: Friday, February 5, 2021, 14:55 [IST]
Other articles published on Feb 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X