Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నెట్ బౌలర్, స్టాండ్-బై బౌలర్‌కు అవకాశాలు వచ్చాయి.. కుల్దీప్‌ చేసిన తప్పేంటి? కోహ్లీ నీకు అర్ధమవుతుందా!

India vs England: Virat Kohli gets trolled for not picking Kuldeep yadav in playing XI
India vs England 1st Test: Cricketrs & Fans Trolls Kohli As Kuldeep Yadav Fails To Find Place Again

చెన్నై: ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్‌కు ఎంపికైనా.. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ బెంచ్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. సిరీస్ డిసైడర్‌ అయిన గబ్బాలో గాయాల కారణంగా కీలక స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు దూరమయినప్పటికీ.. వాషింగ్టన్ సుందర్‌ను జట్టు యాజమాన్యం ఎంచుకుంది. ఇక ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగనున్న టెస్టు సిరీస్‌కు ప్రకటించిన జట్టులో కుల్దీప్‌ పేరు ఉండటం, పైగా భారత పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలం అన్న విశ్లేషణల నేపథ్యంలో అతడికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయం అనుకున్నారు అందరూ. కానీ మరోసారి కుల్దీప్‌కు నిరాశే మిగిలింది.

తొలి టెస్టులో దక్కని చోటు:

తొలి టెస్టులో దక్కని చోటు:

భారత్‌-ఇంగ్లండ్ మధ్య చెన్నైలోని చెపాక్ మైదానంలో ఈరోజు తొలి టెస్టు ప్రారంభం అయింది. టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఇద్ద‌రు ఆఫ్ స్పిన్న‌ర్లు, ఓ లెఫ్టార్మ్ స్పిన్న‌ర్‌ను కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్నాడు. సీనియర్‌ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఆసీస్‌ టూర్‌లో రాణించిన యువ ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌ వైపు కోహ్లీ మొగ్గు చూపాడు. ఇక అక్షర్‌ పటేల్‌ మోకాలి నొప్పితో చివరి నిమిషంలో జట్టుకు దూరం కాగా.. ఆశ్చర్యకరంగా కేవలం ఒకే టెస్ట్ ఆడిన షాబాజ్‌ నదీమ్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు. దీంతో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.

బెంచ్‌కే పరిమితం:

బెంచ్‌కే పరిమితం:

కుల్దీప్‌ యాదవ్‌ 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో చివరిసారిగా సంప్రదాయ క్రికెట్‌ ఆడాడు. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన నాలుగో టెస్టులో, ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టును హడలెత్తించాడు. డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్‌లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక అప్పటి నుంచి టీమిండియా టెస్టు స్క్వాడ్‌లో చోటు దక్కించుకుంటున్న కుల్దీప్‌.. బెంచ్‌కే పరిమితం అయ్యాడు. కుల్దీప్ ఇప్పటివరకు భారత్ తరఫున 6 టెస్టులు, 61 వన్డేలు, 45 టీ20లు ఆడాడు. మొత్తగా 168 వికెట్లు పడగొట్టాడు.

 కుల్దీప్.. ధైర్యంగా ఉండు:

కుల్దీప్.. ధైర్యంగా ఉండు:

ఇక తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కకపోవడంపై భారత మాజీ క్రికెటర్లు, అభిమానులు మండిపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా మహ్మద్‌ కైఫ్ స్పందిస్తూ... 'సరిగ్గా రెండేళ్ల క్రితం, టెస్టుల్లో భారత్ ఫస్ట్‌ చాయిస్‌ స్పిన్నర్ అంటే కుల్దీప్‌ యాదవ్‌ అన్న పేరు వినిపించింది. కానీ ఇప్పుడు జట్టులో చోటు కోసం అతడు పోరాడుతున్నాడు. అయితే అంతగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఆర్ అశ్విన్‌, రిషబ్ పంత్‌ పట్టుదలగా పోరాడిన తర్వాతే జట్టులోకి తిరిగి వచ్చారు. ధైర్యంగా ఉండు కుల్దీప్' అని పేర్కొన్నాడు.

 స్టాండ్-బై బౌలర్‌కు కూడా అవకాశం:

స్టాండ్-బై బౌలర్‌కు కూడా అవకాశం:

'షాబాజ్ నదీమ్‌ ఎంపిక సరైందే. అతడు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌ను ఇబ్బందిపెట్టగలడు. అయితే కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. టీమ్ మేనేజ్మెంట్ వైఖరి చూస్తే ఓ విషం స్పష్టంగా తెలుస్తోంది. కుల్దీప్‌కు అంత ప్రాముఖ్యం ఇవ్వట్లేదు' అని కామెంటేటర్ హర్ష భోగ్లే ట్వీట్ చేశాడు. 'కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కనందుకు బాధగా ఉంది' అని ఆర్పీ సింగ్ ట్వీటాడు. కుల్దీప్‌ను ఉద్దేశించి సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి. 'విరాట్‌.. నేను మరీ అంత పనికిరానివాడినా. నన్ను పక్కకు పెట్టావు. నేను చేసిన తప్పేంటి?', 'ఒక్క అవకాశం దక్కితే నన్ను నేను నిరూపించుకుంటా' అంటూ కుల్దీప్‌ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి షేర్‌ చేస్తున్నారు. 'నెట్ బౌలర్, స్టాండ్-బై బౌలర్‌కు అవకాశాలు వచ్చాయి కానీ కుల్దీప్‌కు మాత్రం నిరాశే ఎదురవుతోంది' అని ఓ అభిమాని కామెంట్ చేశాడు.

Story first published: Friday, February 5, 2021, 14:13 [IST]
Other articles published on Feb 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+