న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అసాధ్యమేమీ కాదు.. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టాప్‌-4 మా లక్ష్యం'

Jason Holder backs West Indies to finish fourth or fifth in World Test Championship

లఖ్‌నవూ: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వెస్టిండీస్‌ జట్టును టాప్‌-4లో నిలపడమే నా లక్ష్యం అని ఆ జట్టు టెస్టు కెప్టెన్ జేసన్‌ హోల్డర్‌ తెలిపాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వెస్టిండీస్‌ టాప్‌-4లో నిలుస్తుందని, ఇదేమి అసాధ్యమేమీ కాదు అని హోల్డర్‌ పేర్కొన్నాడు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో విండీస్ 9 వికెట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం హోల్డర్‌ మీడియాతో మాట్లాడాడు.

'దురుద్దేశంతోనే రవిశాస్త్రిపై ట్రోలింగ్‌.. అవేమి ఆయనపై ప్రభావం చూపవు''దురుద్దేశంతోనే రవిశాస్త్రిపై ట్రోలింగ్‌.. అవేమి ఆయనపై ప్రభావం చూపవు'

 టాప్‌-4 మా లక్ష్యం:

టాప్‌-4 మా లక్ష్యం:

'ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ముగిసే సరికి వెస్టిండీస్‌ జట్టు నాలుగు లేదా ఐదో స్థానంలో నిలవడం అసాధ్యమేమీ కాదు. రెండేళ్ల కాలంలో ఇది మంచి గుర్తింపే. ముందుముందు మాకు కఠిన సిరీస్‌లు ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో ఆడతాం. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు కరీబియన్‌ దీవుల్లో పర్యటిస్తుంది. న్యూజిలాండ్‌తోనూ ఆడాలి. అన్నీ పటిష్ట జట్లే. మాకు వారిని ఓడించగల సత్తా ఉంది' అని హోల్డర్‌ ధీమా వ్యక్తం చేసాడు.

ప్రపంచంలోని ఏ జట్టుతోనైనా పోటీపడగలం:

ప్రపంచంలోని ఏ జట్టుతోనైనా పోటీపడగలం:

'జట్టులోని ఆటగాళ్లు అందరూ నిలకడగా రాణిస్తూ.. మా జట్టును ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలి. అందరు జట్టును అభివృద్ధి చేస్తూ ముందుకెళ్లాలి. అది జరిగితే ప్రపంచంలోని ఏ జట్టుతోనైనా పోటీపడగలం. అఫ్గాన్‌తో పోరు ఛాంపియన్‌షిప్‌లో లేకపోయినా.. ఈ విజయం మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. రకీమ్‌ కార్న్‌వాల్‌ చక్కగా బౌలింగ్‌ చేశాడు. ఇతర బౌలర్ల మద్దతు కూడా ఉంది. షమ్రా బ్రూక్స్‌ బాగా ఆడాడు' అని హోల్డర్‌ అన్నాడు.

స్థిరత్వం కొనసాగించాలి:

స్థిరత్వం కొనసాగించాలి:

'మా బ్యాటర్స్ మరింత బాధ్యత తీసుకోవాలి గత రెండు సిరీస్‌లలో చెప్పాను. వారు అంచనాలను చేరుకున్నారు. మా బౌలింగ్ దాడి ప్రపంచంలోని ఏ జట్టుతోనైనా పోటీ పడగలదని భావిస్తున్నా. అంతా బాగానే ఉంది. కానీ జట్టు స్థిరత్వంలో కొంచెం లోపాలున్నాయి. ప్రపంచ స్థాయి జట్టుగా మారాలంటే.. బౌలింగ్, బ్యాటింగ్‌లో మరింతగా రాణించాలి. మా మొదటి ఇన్నింగ్స్ స్కోర్‌లతో జట్లను ఒత్తిడికి గురిచేయగలిగితే.. వెస్టిండీస్ ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్టుగా మారుతుంది' అని హోల్డర్‌ పేర్కొన్నాడు.

విండీస్ ఘన విజయం:

విండీస్ ఘన విజయం:

ఏకైక టెస్టులో విండీస్ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. 31 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 6.2 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి విజయం సాధించింది. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (8) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా.. క్యాంప్‌బెల్‌ (19 నాటౌట్‌), షాయ్‌ హోప్‌ (6 నాటౌట్‌)లు మరో వికెట్‌ పడకుండా విండీస్‌కు విజయాన్ని అందించారు. వెస్టిండీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 277 పరుగులు చేయగా.. అఫ్గాన్‌187 పరుగులు చేసింది. ఇక అఫ్గానిస్తాన్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 43.1 ఓవర్లలో 120 పరుగులకే చాపచుట్టేసింది.

Story first published: Sunday, December 1, 2019, 15:04 [IST]
Other articles published on Dec 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X