న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికాతో టెస్టు.. అరుదైన రికార్డుకు చేరువలో అండర్సన్‌!!

James Anderson will be the ninth cricketer to reach the 150 test milestone

సెంచూరియన్‌: ఇంగ్లాండ్‌ స్టార్ బౌలర్ 'స్వింగ్ కింగ్' జేమ్స్‌ అండర్సన్‌ అరుదైన రికార్డు నెలకొల్పనున్నాడు. ఇప్పటివరకు 149 టెస్టులు ఆడిన అండర్సన్‌.. దక్షిణాఫ్రికాతో గురువారం తన 150వ టెస్టును ఆడనున్నాడు. దీంతో 150 టెస్టులు ఆడిన రెండో ఇంగ్లీష్ క్రికెటర్‌గా జిమ్మీ రికార్డు సృష్టించనున్నాడు. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ (161) మాత్రమే అండర్సన్‌ కంటే ముందున్నాడు.

<strong>పాక్‌ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు.. గంగూలీ 'సూపర్‌ సిరీస్‌' ప్రతిపాదన ఫ్లాప్‌ అవుతుంది</strong>పాక్‌ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు.. గంగూలీ 'సూపర్‌ సిరీస్‌' ప్రతిపాదన ఫ్లాప్‌ అవుతుంది

సచిన్@1

సచిన్@1

క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకు 9 మంది మాత్రమే టెస్ట్ ఫార్మాట్‌లో 150 మ్యాచ్‌లు ఆడారు. ఈ జాబితాలో భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ (200) అగ్ర స్థానంలో ఉన్నాడు. సచిన్‌, రికీ పాంటింగ్‌ (168), స్టీవ్‌ వా (168), జాక్వస్ కలిస్ (166), శివ నరేన్ చంద్రపాల్‌ (164), రాహుల్‌ ద్రవిడ్‌ (164), అలిస్టర్ కుక్‌ (161), అలెన్ బోర్డర్ (156)లు 150 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు.

 సెంచూరియన్‌లో తొలి టెస్టు:

సెంచూరియన్‌లో తొలి టెస్టు:

దక్షిణాఫ్రికా పర్యటనలో ఇంగ్లాండ్‌ నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. మొదటగా టెస్టులు జరగనుండగా.. ఆ తర్వాత వన్డేలు, టీ20లు జరగనున్నాయి. ఈ పర్యటన 2019 డిసెంబర్ 26న మొదలై.. 2020 ఫిబ్రవరి 16తో ముగుస్తుంది. సెంచూరియన్‌లో రేపు తొలి టెస్టు ప్రారంభం కానుంది.

నాలుగు నెలల విరామం:

నాలుగు నెలల విరామం:

దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత ఆండర్సన్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆగస్టులో ఆస్ట్రేలియాతో చివరిగా టెస్టు ఆడాడు. విరామం తర్వాత తిరిగి జట్టులోకి చేరుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని జిమ్మీ తెలిపాడు. 'చాలా కాలం తర్వాత క్రికెట్‌ ఆడుతున్నందుకు ఆనందంగా ఉంది. దాదాపు నాలుగు నెలల నుంచి క్రికెట్‌ ఆడలేదు. నా లయను తిరిగి అందిపుచ్చుకోవాలని భావిస్తున్నా' అని తెలిపాడు.

టెస్ట్ ఫార్మాట్‌లో 575 వికెట్లు:

టెస్ట్ ఫార్మాట్‌లో 575 వికెట్లు:

ఇంగ్లాండ్‌ తరఫున అండర్సన్‌ ఇప్పటివరకు 149 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20లు ఆడాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 575 వికెట్లు, వన్డేల్లో 269 వికెట్లు, టీ20ల్లో 18 వికెట్లు తీసాడు. మొత్తంగా 5 వికెట్లు 29 సార్లు తీసాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 27 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది.

Story first published: Wednesday, December 25, 2019, 13:39 [IST]
Other articles published on Dec 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X