న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్‌ టెస్ట్ సిరిస్‌కు ముందు ఇంగ్లాండ్‌కు ఊహించని ఎదురుదెబ్బ

James Anderson ruled out of Ireland Test as Ashes looms

హైదరాబాద్: యాషెస్ టెస్టు సిరిస్‌కు ముందు ఇంగ్లాండ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కాలిపిక్క గాయంతో ఐర్లాండ్‌తో బుధవారం నుంచి ఆరంభమయ్యే ఏకైక టెస్టు మ్యాచ్‌కి జేమ్స్ ఆండర్సన్ దూరమయ్యాడు. ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది.

మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్

జులై 2న దుర్హమ్‌-లాంక్‌షైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జేమ్స్ ఆండర్సన్ గాయపడ్డాడు. ఆటలో భాగంగా మూడో రోజు ఆండర్సన్‌కు ఉన్నట్టుండి ఒక్కసారిగా కాలి పిక్క పట్టకపోవడంతో బలవంతంగా మైదానాన్ని వీడాడు. యాషెస్ టెస్టు సిరిస్‌కు ముందు ఆండర్సన్ గాయపడటం ఆ జట్టు పేస్ ఎటాక్‌పై ప్రభావం చూపింది.

దీంతో ఐర్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పేస్ ఎటాక్‌ను స్టువర్ట్ బ్రాడ్ లీడ్ చేయనున్నాడు. మరోవైపు ఐర్లాండ్‌తో టెస్టులో మార్క్ ఉడ్, జోప్రా ఆర్చర్ సేవలను సైతం ఇంగ్లాండ్ జట్టు కోల్పోనుంది. యాషెస్ టెస్టు సిరిస్‌ను దృష్టిలో పెట్టుకుని వీరికి సెలక్టర్లు విశ్రాంతి కల్పించనున్నట్లు తెలుస్తోంది.

యాషెస్ టెస్టు సిరిస్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టు ఐర్లాండ్‌తో నాలుగు రోజుల ఏకైక టెస్టు మ్యాచ్ అడనుంది. ఐర్లాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమిస్తోంది. గతేడాది ఐసీసీ ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్‌కు ఒకేసారి టెస్టు హోదాను కల్పించిన సంగతి తెలిసిందే.

ఆప్ఘనిస్థాన్‌ తన తొలి టెస్టుని గతేడాది టీమిండియాతో ఆడగా.... ఐర్లాండ్ డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్‌తో ఆడింది. తన తొలి టెస్టులో పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైన ఐర్లాండ్... ఆ తర్వాత ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో మాత్రం విజయం సాధించింది. ఇప్పుడు మూడో టెస్టులో ఇంగ్లాండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది.

కాగా, 1971 తర్వాత ఇంగ్లాండ్ తొలిసారి ఐదు రోజులకు తక్కువగా ఓ టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. అప్పట్లో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇంగ్లాండ్ ఐర్లాండ్‌తో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడబోతోంది.

ఐర్లాండ్‌తో ఏకైక టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు:
జో రూట్(కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్ స్టో(వికెట్ కీపర్), స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, శామ్ కర్రన్, జోయి డేన్లే, లూయిస్ గ్రొగరీ, జాక్ లీచ్, జేసన్ రాయ్, ఓల్లీ స్టోన్, క్రిస్ వోక్స్.

Story first published: Tuesday, July 23, 2019, 16:20 [IST]
Other articles published on Jul 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X