న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా vs ఇండియా: 'పెర్త్ టెస్టులో టాస్ ఓడితే మంచిదే'

It would be a good toss to lose, says Tim Paine

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా శుక్రవారం రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. భారత్‌తో పెర్త్ వేదికగా శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టుకు తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా ఆస్ట్రేలియా జట్టు బరిలోకి దిగనుంది.

<strong>రవీంద్ర జడేజాది ఓ ప్రత్యేక శైలి, ఎవరితోనూ పోల్చలేం: కోచ్</strong>రవీంద్ర జడేజాది ఓ ప్రత్యేక శైలి, ఎవరితోనూ పోల్చలేం: కోచ్

రెండో టెస్టుకు అడిలైడ్‌లో ఆడిన జట్టే పెర్త్‌లోనూ బరిలోకి దిగనుందని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అధికారిక ప్రకటన చేశాడు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించడంతో సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో పెర్త్ టెస్టులో జట్టులో మార్పులు ఉంటాయని అంతా భావించారు.

ముఖ్యంగా అడిలైడ్‌ టెస్టులో తీవ్రంగా నిరాశపరిచిన ఓపెనర్ అరోన్ ఫించ్, పేసర్ మిచెల్ స్టార్క్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా వేటు వేయనుందనే వార్తలు వచ్చాయి. అయితే, రెండో టెస్టుకు మార్పుల్లేకుండానే బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. అంతేకాదు రెండో టెస్టులో టాస్‌ ఓడిపోయినా మంచిదేనని అన్నాడు

పెర్త్ టెస్టుని ప్రతిష్టాత్మకంగా

పెర్త్ టెస్టుని ప్రతిష్టాత్మకంగా

పెర్త్ టెస్టుని ఆతిథ్య జట్టు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ వెల్లడించాడు. రెండో టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న పెర్త్ పిచ్‌పై అధికంగా పచ్చిక ఉండటం, ఎండ భరించలేనంత ఉండటంతో టాస్‌ ఓడినా ఫర్వాలేదని టిమ్ పైన్ చెప్పుకొచ్చాడు.

టాస్‌ ఓడినా ఫర్వాలేదు

టాస్‌ ఓడినా ఫర్వాలేదు

"ఔను, టాస్‌ ఓడినా ఫర్వాలేదు. ఉదయమే క్యూరేటర్‌తో మాట్లాడా. పిచ్‌ మరీ విపరీతంగా స్పందిస్తుందని అనుకోను. వన్డే, టీ20ల్లో రెండు ఎండ్స్‌ పచ్చికతో కనిపించాయి. ప్రస్తుతం ఇక్కడున్న ఎండతో పిచ్‌పై కచ్చితంగా పగుళ్లు వస్తాయి. కావాల్సిందల్లా తొలిరోజు శుభారంభం లభించడం" అని టిమ్ పైన్‌ అన్నాడు.

రోహిత్, అశ్విన్ దూరం

రోహిత్, అశ్విన్ దూరం

మరోవైపు గాయాల కారణంగా రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ రెండో టెస్టుకు దూరమయ్యారు. వీరి స్థానంలో హనుమ విహారి, రవీంద్ర జడేజాలకు చోటు కల్పించారు. దీనిపై టిమ్ పైన్ మాట్లాడుతూ "భారత్‌ జట్టులోకి కొత్తవారు వచ్చారు. ఈ మార్పు గురించి మేం మాట్లాడుకున్నాం. కొన్ని వారాల క్రితమే ఆ జట్టు మొత్తం ఆటగాళ్ల బలాబలాల గురించి చర్చించాం. మ్యాచ్‌ గెలిచి 2-0తో సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని కోహ్లీసేన కోరుకుంటోంది" అని అన్నాడు.

 తొలి బంతి నుంచే జాగ్రత్తగా ఆడాలి

తొలి బంతి నుంచే జాగ్రత్తగా ఆడాలి

"అందుకే మేం తొలి బంతి నుంచే జాగ్రత్తగా ఆడాలి. మా క్రికెటర్లపై విశ్వాసం ఉంది. వారు పుంజుకోనేలా ప్రోత్సహిస్తున్నాం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఫించ్‌ విజయవంతం అయ్యాడు. మిచెల్‌ స్టార్క్‌ రాణిస్తాడన్న నమ్మకం ఉంది. పెర్త్‌ పరిస్థితులు అతడికి సరిపోతాయి. కోహ్లీని తక్కువ పరుగులకే పరిమితం చేసినందుకు సంతోషంగా ఉంది. డీఆర్‌ఎస్‌ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మెరుగైతే మంచిది" అని టిమ్ పైన్‌ అన్నాడు.

Story first published: Thursday, December 13, 2018, 18:57 [IST]
Other articles published on Dec 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X