న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రసెల్‌తో ఆడినప్పుడు మ్యాచ్‌ హైలెట్స్‌ చూస్తున్నామా అనిపిస్తుంది: యువ క్రికెటర్

Its like watching highlights on TV: Shubman Gill on batting with Andre Russell
IPL 2020 : Shubman Gill On Batting with Andre Russell In KKR Matches

కోల్‌కతా : కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా క్రీడలన్నీ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక లాక్‌డౌన్‌ కారణంగా ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం అందరూ కరోనా సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే చాలామంది సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా యువ ఆటగాడు శుభమన్‌ గిల్‌ ట్విటర్‌ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన స్టయిల్లో సమాధానాలు ఇచ్చాడు.

<strong>టీ20 ప్రపంచకప్‌ జరగకపోవడమే మేలు: స్టార్ ఓపెనర్</strong>టీ20 ప్రపంచకప్‌ జరగకపోవడమే మేలు: స్టార్ ఓపెనర్

హైలెట్స్‌ చూస్తున్నామా అనిపిస్తుంది:

హైలెట్స్‌ చూస్తున్నామా అనిపిస్తుంది:

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరపున విండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌తో బ్యాటింగ్‌ చేసేటప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుందని శుభమన్‌ గిల్‌ను ఒక అభిమాని అడగ్గా... 'రసెల్‌తో ఆడినప్పుడు మ్యాచ్‌ హైలెట్స్‌ చూస్తున్నామా అనే ఫీలింగ్‌ వస్తుంది. ఎందుకంటే.. అతను ఆడితే నేను నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌కు పరిమితమవ్వాల్సి వస్తుంది. అతడో అద్భుత ఆటగాడు. వరుస బౌండరీలు బాదుతాడు. మ్యాచ్ గతిని ఒక్కసారిగా మారుస్తాడు' అని పేర్కొన్నాడు.

సచిన్‌తో ఆడడానికి ఇష్టపడతా:

సచిన్‌తో ఆడడానికి ఇష్టపడతా:

క్రికెట్‌ నుంచి రిటైరైన ఆటగాళ్లలో ఎవరితో ఆడడానికి ఇష్టపడతావు మరో అభిమాని ప్రశ్నించగా.. పంజాబ్ బ్యాట్స్‌మన్‌ గిల్ ఒక్క సెకన్‌ కూడా ఆలోచించకుండా క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరు చెప్పేశాడు. 'సచిన్‌ గొప్ప ఆటగాడు. అతని ఆటను చూస్తూ పెరిగా. ఇప్పటికీ అవకాశమొస్తే సచిన్‌తో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా' అని పేర్కొన్నాడు. విదేశీ ఆటగాళ్లలో తనకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్ అంటే ఎంతో ఇష్టమని వెల్లడించాడు.

 కార్తీక్ గొప్ప కెప్టెన్:

కార్తీక్ గొప్ప కెప్టెన్:

కోల్​కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్ దినేశ్ కార్తీక్ గొప్ప కెప్టెన్ అని శుభమన్‌ గిల్‌ పేర్కొన్నాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్ యజమాని షారూక్​ ఖాన్ ​తాము ఓడినా.. గెలిచినా ఎప్పుడూ ఎంతో మద్దతుగా నిలుస్తాడని చెప్పుకొచ్చాడు. ఫుట్​బాల్​లో తనకు క్రిస్టియానో రొనాల్డో కంటే లియోనెల్ మెస్సీ అంటేనే ఇష్టమని ​గిల్ తెలిపాడు. 2018 నుంచి కేకేఆర్‌ తరపున ఆడుతున్న శుభమన్‌.. 132 స్ట్రైక్‌రేట్‌తో 499 పరుగులు సాధించాడు.

తుది జట్టులో చోటు దక్కడం లేదు:

తుది జట్టులో చోటు దక్కడం లేదు:

దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న శుభమన్ గిల్‌‌కు గతేడాది నుంచి భారత్ జట్టు‌కు ఎంపికవుతున్నా తుది జట్టులో మాత్రం అవకాశం లభించడం లేదు. వాస్తవానికి గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో‌నే గిల్‌‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా రోహిత్ శర్మ ఓపెనర్‌గా ఆడటం.. సెంచరీ సాధించడంతో మళ్లీ గిల్‌‌కు ఆడే అవకాశం రాలేదు. అయితే ఈ యువ క్రికెటర్ మాత్రం భారత్-ఎ జట్టు, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు.

 టీమిండియా ఫ్యూచర్ స్టార్:

టీమిండియా ఫ్యూచర్ స్టార్:

తాజాగా హర్భజన్ సింగ్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న హిట్‌మ్యాన్.. శుభమన్ గిల్ గురించి మాట్లాడాడు. 'గిల్‌‌కు మంచి బ్యాటింగ్ నైపుణ్యం ఉంది. అతను టీమిండియా ఫ్యూచర్ స్టార్. బ్యాటింగ్‌లో గిల్ నిలకడ సాధించగలిగితే.. అతని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేశవాళీ క్రికెట్‌లో అతనికి మెరుగైన రికార్డులు ఉన్నాయి. నా అంచనా ప్రకారం త్వరలోనే అతనికి మళ్లీ భారత్ జట్టులో అవకాశం దక్కుతుంది' అని అన్నాడు.

Story first published: Wednesday, April 29, 2020, 14:55 [IST]
Other articles published on Apr 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X