న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా రిటైర్డ్ ఎలెవన్ vs కోహ్లీ సేన మధ్య చారిటీ మ్యాచ్ నిర్వహించవచ్చు కదా: ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan selects his Retired Team India XI for a charity-cum-farewell game against Current Team India XI

న్యూఢిల్లీ: ఫేర్‌వెల్ మ్యాచ్‌లు ఆడకుండా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆటగాళ్ల కోసం టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ ఆసక్తికరమైన ప్రతిపాదనను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ముందు ఉంచాడు. దిగ్గజ ఆటగాళ్లకు ఘన వీడ్కోలు లభించలేదని బాధపడే బదులు రిటైర్డ్ ఎలెవన్, కోహ్లీ సేన మధ్య ఓ చారిటీ మ్యాచ్ నిర్వహిస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించాడు.

ఇటీవల భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా తమ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆకస్మిక నిర్ణయంతో దిగ్గజ ఆటగాళ్లైన ఈ ఇద్దరికి సరైనా సెండాఫ్ దక్కలేదని చాలా మంది మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులూ పెదవి విరిచారు.

ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని ప్లేయర్స్..

ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని ప్లేయర్స్..

ముఖ్యంగా భారత్‌కు రెండు ప్రపంచకప్‌లతో పాటు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన ధోనీకి ఫేర్‌వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు. బీసీసీఐ కూడా మహీ ఫేర్‌వెల్ మ్యాచ్ గురించి చర్చిస్తామని, ఘన సత్కారంతోనే అతనికి వీడ్కోలు పలుకుతామని తెలిపింది. అయితే.. భారత క్రికెట్‌లో ఫేర్‌వెల్ మ్యాచ్‌ ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించడం చాలా కామన్‌గా మారిపోయింది. ఎంతలా అంటే..? గత దశాబ్దకాలంగా ఓ 11 మంది క్రికెటర్లు ఇలా చివరి మ్యాచ్ ఆడకుండానే తమ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ బై చెప్పేశారు.

ఒక్క మ్యాచ్‌తో అందరికి ఘనవీడ్కోలు..

ఒక్క మ్యాచ్‌తో అందరికి ఘనవీడ్కోలు..

ఈ ఏడాది ధోనీ, సురేశ్ రైనా ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించగా.. గత ఏడాది యువరాజ్ సింగ్, అంబటి రాయుడు (రిటైర్మెంట్‌పై యూటర్న్) వీడ్కోలు చెప్పేశారు. అంతకు ముందు గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్.. ఇలా 11 మంది భారత క్రికెటర్లు ఘన వీడ్కోలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఘన వీడ్కోలు లేకుండా రిటైర్ అయ్యిన ఆటగాళ్లు, ప్రస్తుత టీమిండియా మధ్య చారిటీ మ్యాచ్ నిర్వహించాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. మహీ వీడ్కోలు మ్యాచ్ గురించి నడుస్తున్న చర్చతో అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా పఠాన్‌ ఈ ప్రతిపాదన చేశాడు. ట్విటర్ వేదికగా సెండాఫ్ లేని ఆటగాళ్ల జాబితాను కూడా పంచుకున్నాడు.

ఎలా ఉంటుంది..

ఎలా ఉంటుంది..

‘చాలా మంది వీడ్కోలు తీసుకున్న ఆటగాళ్ల కోసం ఫేర్‌వెల్ మ్యాచ్‌ గురించి మాట్లాడుతున్నారు. రిటైర్మెంట్‌ అయిన ఆటగాళ్లు కూడా సరైన వీడ్కోలు పొందలేదు. ప్రస్తుత భారత జట్టుతో రిటైర్డ్ ఆటగాళ్లతో కూడిన జట్టు నుంచి చారిటీ కమ్ వీడ్కోలు మ్యాచ్‌ పెడితే ఎలా ఉంటుంది.' అని పఠాన్ శనివారం ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండా వీడ్కోలు పలికిన టీమ్ సభ్యుల వివరాలను జత చేశాడు.

సచిన్, గంగూలీ తప్పా..

సచిన్, గంగూలీ తప్పా..

పఠాన్‌ ప్రకటించిన జట్టులో గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్‌ ఓపెనర్లు కాగా.. మిడిలార్డర్‌లో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్‌ లక్ష్మణ్, యువరాజ్‌ సింగ్, ధోనీ వరుసగా ఉన్నారు. బౌలర్లుగా ఇర్ఫాన్ పఠాన్‌, అజిత్ అగార్కర్‌, జహీర్ ఖాన్, ప్రజ్ఞాన్ ఓజా ఉన్నారు. ఈ జట్టులో ఘన వీడ్కోలు అందుకున్న సచిన్, గంగూలీ మాత్రం చోటు దక్కలేదు. 2013లో సచిన్ టెండూల్కర్‌ చివరి మ్యాచ్ కోసం బీసీసీఐ అప్పట్లో రూ. కోట్లు ఖర్చు పెట్టిన విషయం తెలిసిందే.

England vs Pakistan: నీ కళ్లు కెమెరాల ఏంది సామి.. అంపైర్‌పై నెటిజన్ల ప్రశంసలు!

Story first published: Sunday, August 23, 2020, 10:16 [IST]
Other articles published on Aug 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X