న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

England vs Pakistan: నీ కళ్లు కెమెరాల ఏందీ సామి.. అంపైర్‌పై నెటిజన్ల ప్రశంసలు!

Netizens heaps praise on Michael Gough for his LBW call in England-Pakistan Test

సౌతాంప్టన్: టెక్నాలజీ సౌకర్యం అమితంగా ఉన్న ప్రస్తుత క్రికెట్‌లో అంపైర్లు తప్పు చేయడం తరుచూ చూస్తూనే ఉన్నాం. క్రికెట్ మీద అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికి తెలిసేలా మరీ అంపైర్లు అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ తప్పుడు నిర్ణయాల నుంచి డీఆర్ఎస్‌తో కొన్నిసార్లు బ్యాట్స్‌మెన్ గట్టెక్కినా.. మరికొన్ని సార్లు మాత్రం బలవుతున్నారు.

అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్ల మ్యాచ్‌లే ప్రభావితమైన సందర్భాలున్నాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో స్థానిక అంపైర్లను వినియోగించుకోవాలని ఐసీసీ సూచించిన కొత్త మార్గదర్శకాలతో కూడా అంపైర్ల తప్పిదాలు ఎక్కువయ్యాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఐసీసీ డీఆర్ఎస్‌ల సంఖ్యను పెంచినా ఫలితం లేకుండా పోయింది.

కరోనా విరామం అనంతరం జరిగిన ఇంగ్లండ్-వెస్టిండీస్ ఫస్ట్ టెస్ట్‌లో అంపైర్ల ఘోర తప్పిదాలు, పక్షపాత దోరణీ స్పష్టమైంది. ఒక టెస్ట్‌లోనే ఏకంగా ఐదు తప్పిదాలు చేశారు. అవి కూడా ఆతిథ్య జట్టుకు అనుకూలంగా ఉండటం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. సోషల్ మీడియా వేదికగా అంపైర్లపై అభిమానులు తీవ్ర ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. అయితే తాజాగా ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. అంపైర్ మైఖెల్ గాఫ్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తుంది.

ఇంతకేం జరిగిందంటే..?

టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టు ఆదిలోనే ఓపెనర్ రోరీ బర్న్స్(6) వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన జాక్ క్రాలీతో మరో ఓపెనర్ డామ్ సిబ్లీ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించాడు. 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకొని క్రీజులో పాతుకుపోతున్న ఈ జోడీని స్పిన్నర్ యాసిర్ షా అద్భుత బంతితో విడదీశాడు. డామ్ సిబ్లీ(22)ని వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.

యాసిర్ స్పిన్‌ను ఆడటానికి తడబడుతున్న సిబ్లీ.. అతను వేసిన 18.2 బంతిని లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సిబ్లీ ట్రాక్ మిస్సవ్వడంతో బంతి నేరుగా ప్యాడ్లను తాకింది. దీంతో పాక్ ఆటగాళ్లు బిగ్గరగా అప్పీల్ చేయగా.. అంపైర్ మైఖెల్ గాఫ్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయాన్ని సిబ్లీ సవాల్ చేయగా.. రిప్లేలో బంతి బ్యాట్‌కు తాకలేదని, మిడిల్ స్టంప్‌ను తాకేలా దూసుకెళ్లిందని స్పష్టమైంది. దీంతో సిబ్లీ వెనుదిరగ్గా.. ఖచ్చితమైన మైఖెల్ గాఫ్ అంపైరింగ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

ప్రశంసించిన ఐసీసీ..

మైఖెల్ గాఫ్ అంపైరింగ్‌ను కొనియాడుతూ ఐసీసీ ఈ వికెట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేయగా వైరల్ అయింది. ఈ వీడియోకు ఐసీసీ ‘అంపైరింగ్‌లో గొప్ప భాగం'అని క్యాప్షన్‌గా పేర్కొంది. ఇక ఈ వీడియోను చూసిన అంతర్జాతీయ క్రికెటర్లు, అభిమానులు గాఫ్‌ అంపైరింగ్‌ను కొనియాడుతున్నారు. ‘నీ కళ్లు కెమెరాల ఏందీ సామి'అంటూ కామెంట్ చేస్తున్నారు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా గాఫ్ అంపైరింగ్‌ను ప్రశంసించాడు. ‘మైఖెల్ గాఫ్ 100కు 100 మార్కులు'అని కామెంట్ చేశాడు. ఇంకొందరు గాఫ్ ఒక్కడే డీఆర్‌ఎస్‌లో 90 శాతం సక్సెస్ అయిందని ట్వీట్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.

సూపర్ బౌలింగ్.. డూపర్ క్యాచ్..

డామ్ సిబ్లీ వికెట్ అనంతరం కెప్టెన్ జోరూట్(29) క్రీజులోకి రాగా.. అతన్ని 17 ఏళ్ల నసీమ్ షా అద్భుత బంతితో పెవిలియన్‌కు చేర్చాడు. షా సూపర్ బాల్ వేస్తే కీపర్ మహ్మద్ రిజ్వాన్ సూపర్ డైవ్‌తో క్యాచ్ అందుకున్నాడు. అతను వేసిన 35.2వ గుడ్ లెంగ్త్ బంతిని రూట్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకోని ఫస్ట్ స్లిప్ ఫీల్డర్ దిశగా దూసుకెళ్లగా... కీపర్ రిజ్వాన్ సూపర్ మ్యాన్‌లా డైవ్ చేసి అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ సూపర్ బాల్ అనే క్యాప్షన్‌తో షేర్ చేయగా వైరల్ అయింది.

జాక్ క్రాలీ సెంచరీ..

జాక్ క్రాలీ సెంచరీ..

ఓవైపు వరుస విరామాల్లో ఇంగ్లండ్ వికెట్లు కోల్పోయినా.. మరోవైపు ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ జాక్ క్రాలీ అద్భుతంగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాక్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూనే వీలు చిక్కిన బంతిని బౌండరీలకు తరలించాడు. మంచి బంతులను గౌరవిస్తూ తన మ్కార్ షాట్లతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే 171 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మహ్మద్ అబ్బాస్ బౌలింగ్‌‌లో రెండు పరుగులు తీసిన జాక్ క్రాలీ కెరీర్‌లో ఫస్ట్ సెంచరీ సాధించాడు.

దీంతో ఇంగ్లండ్ ప్రస్తుతం 80 ఓవర్లలో 4 వికెట్లకు 290 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ(163 బ్యాటింగ్), జోస్ బట్లర్(63 బ్యాటింగ్) ఉన్నారు.

నువ్వు హెచ్చరించి పదేళ్లు అయింది కోహ్లీ భాయ్.. నన్నేం చేయలేకపోయావ్.. !

Story first published: Friday, August 21, 2020, 22:30 [IST]
Other articles published on Aug 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X