న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Kevin O'Brien: ఆడాలనే ఆసక్తి, ప్రేమ లేదంటూ.. వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్ క్రికెటర్!!

Ireland star All-Rounder Kevin OBrien Retires From ODI

డబ్లిన్: ఐర్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కెవిన్ ఒబ్రెయిన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల కెవిన్ వన్డే క్రికెట్‌కు గురువారం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. వన్డే ఫార్మాట్‌లో కొనసాగాలనే ఆసక్తి, ప్రేమ తనకు లేదని పేర్కొన్నాడు. టీ20 క్రికెట్​పై దృష్టి సారించడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు వెల్లడించాడు. టెస్టు, టీ20 క్రికెట్‌కు మ్యాచ్‌లకు మాత్రం కెవిన్ ఒబ్రెయిన్ అందుబాటులో ఉండనున్నాడు. వీడ్కోలు నిర్ణయం తీసుకోవడం అంత సులభమైన విషయం కాదని, అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తప్పదని కెవిన్ చెప్పాడు.

WTC Final 2021: టీమిండియా తుది జట్టులో మార్పులు.. విహారికి ఛాన్స్! అంతా వరణుడి దయ!!WTC Final 2021: టీమిండియా తుది జట్టులో మార్పులు.. విహారికి ఛాన్స్! అంతా వరణుడి దయ!!

'ఐర్లాండ్‌ జట్టుకు 15 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించాను. వన్డే క్రికెట్‌ నుంచి వైదొలగడానికి, రిటైర్మెంట్‌ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా. దేశం తరఫున 153 వన్డేల్లో ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. జట్టుకు ఆడిన మధుర క్షణాలు నా జీవితాంతం గుర్తుంటాయి. వీడ్కోలు నిర్ణయం తీసుకోవడం అంత సులభమైన విషయం కాదు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తప్పలేదు. వన్డే ఫార్మాట్​లో గతంలో ఉన్న ఫామ్​ ఇప్పుడు లేదు. అందుకే ఇకపై వన్డేల్లో కొనసాగొద్దని అనుకుంటున్నా' అని కెవిన్ ఒబ్రెయిన్ తెలిపాడు.

ఐర్లాండ్​ తరఫున 153 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన కెవిన్ ఒబ్రెయిన్​.. 88.72 స్ట్రైక్​ రేట్​తో 3618 పరుగులు సాధించాడు. ఐర్లాండ్ తరఫున అత్యధిక వన్డే రన్స్​ చేసిన మూడో ఆటగాడు కెవిన్. ఇక తన మీడియం పేస్‌తో 114 వికెట్లు తీసి.. ఐర్లాండ్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా తనపేరిట ఓ రికార్డు లిఖించుకున్నాడు. కెవిన్ ఇప్పటివరకు మూడు టెస్టుల్లో 258 రన్స్ చేసినా.. ఒక్క వికెట్ తీయలేదు. 96 టీ20ల్లో 1672 రన్స్, 58 వికెట్లు పడగొట్టాడు.

భారత్‌ ఆతిథ్యమిచ్చిన 2011 వన్డే ప్రపంచకప్‌ ద్వారా కెవిన్‌ ఒబ్రెయిన్ ఒక్కసారిగా స్టార్‌ బ్యాట్స్‌మన్‌గా మారిపోయాడు. తన సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి చూపించాడు. ప్రపంచకప్‌లో భాగంగా బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒబ్రెయిన్ రికార్డు శతకం బాదేశాడు. కేవలం 50 బంతుల్లోనే 100 పరుగుల మార్క్‌ చేరుకున్నాడు. ఆ మ్యాచులో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్ 327 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఒబ్రెయిన్‌ (113 రన్స్‌) మెరుపు సెంచరీ బాదడంతో ఐర్లాండ్‌ సునాయాస విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో ఇదే అత్యంత వేగవంతమైన శతకంగా నిలిచింది. ఆ రికార్డును ప్రపంచకప్​లో ఇప్పటికీ ఎవరు బ్రేక్​ చేయలేదు.

Story first published: Friday, June 18, 2021, 21:41 [IST]
Other articles published on Jun 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X