న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRHvsCSK: ఏ జట్టు గెలిచినా కప్ చెన్నై‌కే దక్కుతుంది??

IPL Trophy will go to Chennai

హైదరాబాద్: ఐపీఎల్ తుది సమరంలో హైదరాబాద్‌పై చెన్నై జట్టే పైచేయి సాధించనుంది. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఆదివారం సాయంత్రం వాంఖడే స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో సన్‌రైజర్స్‌పై రెండుసార్లు గెలిచిన ధోనీ సేన.. తొలి క్వాలిఫయర్‌లోనూ హైదరాబాద్‌పై గెలుపొందింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న చెన్నై ఫేవరేట్‌గా ఫైనల్లో బరిలో దిగనుంది.

పోరాట పటిమతో తుది పోరుకు

పోరాట పటిమతో తుది పోరుకు

మరోవైపు వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ.. రెండో క్వాలిఫయర్‌లో నెగ్గిన సన్‌రైజర్స్ పోరాట పటిమతో తుది పోరుకు సిద్ధమైంది. ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టు ఏ జట్టు ఏడోసారి ఫైనల్ ఆడుతుండగా.. సన్‌రైజర్స్ మూడేళ్లలో రెండోసారి ఫైనల్ చేరింది. ఐపీఎల్‌లో ఇరు జట్లు 9 సార్లు ముఖాముఖి తలపడితే.. ఏడుసార్లు చెన్నై గెలవగా.. రెండుసార్లు సన్‌రైజర్స్ విజయం సాధించింది.

దక్షిణాది జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్

దక్షిణాది జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్

గణాంకాల పరంగా ధోనీసేన ఫేవరేట్‌గా కనిపిస్తోంది. రెండు బలమైన దక్షిణాది జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ కోసం దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కూల్‌గా ఉండే ఇద్దరు కెప్టెన్లు తమ జట్లను ఎలా ముందుకు నడిపిస్తారోనన్న సందేహంతో ఇరు జట్ల అభిమానులు ఎదురు చూస్తున్నారు. కోల్‌కతాపై ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన రషీద్ ఖాన్ మరోసారి సత్తా చాటాలని హైదరాబాద్ భావిస్తుంటే.. తమ బ్యాట్స్‌మెన్ స్థాయికి తగ్గట్టు రాణించాలని చెన్నై కోరుకుంటోంది.

2 యాజమాన్యాలు మాత్రం చెన్నైకి చెందినవే

2 యాజమాన్యాలు మాత్రం చెన్నైకి చెందినవే

చెన్నై, హైదరాబాద్ ఫ్రాంచైజీలు ఫైనల్లో తలపడుతున్నప్పటికీ.. వాటి యాజమాన్యాలు మాత్రం చెన్నైకి చెందినవే కావడం గమనార్హం. సూపర్ కింగ్స్ జట్టు యజమాని ఇండియా సిమెంట్స్‌‌కి అధిపతి శ్రీనివాసన్‌ అయితే సన్‌రైజర్స్ యాజమాన్యం సన్‌ టీవీదనేది తెలిసిన విషయమే.

చెన్నైలోని బోట్‌ క్లబ్ రోడ్డులో పక్క పక్క ఇళ్లలో

చెన్నైలోని బోట్‌ క్లబ్ రోడ్డులో పక్క పక్క ఇళ్లలో

ఈ రెండు సంస్థల కార్పొరేట్ హెడ్‌క్వార్టర్లు చెన్నైలోని గ్రీన్‌వేస్ రోడ్‌లోనే ఉన్నాయి. ఈ రెండు సంస్థల యజమానులు చెన్నైలోని బోట్‌ క్లబ్ రోడ్డులో పక్క పక్క ఇళ్లలో ఉంటుండం విశేషం. దీంతో ఫైనల్లో సన్‌రైజర్స్ గెలిచినా కూడా కప్ చెన్నైదే అని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

Story first published: Sunday, May 27, 2018, 12:37 [IST]
Other articles published on May 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X