ఏప్రిల్ 9న హైదరాబాద్‌లో ఐపీఎల్ తొలి మ్యాచ్: ఎవరితో తెలుసా?

Posted By:
ipl starts in hyderabad from april 9th

హైదరాబాద్: అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పండగకు ముహూర్తం ఖరారైంది. 11వ సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ వెల్లడైంది. 51 రోజులపాటు 9 వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న వాంఖడేలో తొలి మ్యాచ్‌ జరగనుంది.

తొలి మ్యాచ్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రెండేళ్ల తర్వాత తిరిగి పునరాగమనం చేస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ కూడా వాంఖడేలోనే మే 27న జరగనుంది. ఏప్రిల్‌ 6న ముంబైలోనే ఐపీఎల్ ఆరంభ వేడుకలు ఘనగా జరగనున్నాయి.

ఐపీఎల్ 2018 షెడ్యూల్ విడుదల: మ్యాచ్ టైమింగ్స్, వేదికల వివరాలివే

ఇదిలా ఉంటే, చెన్నైతోపాటు రెండేళ్లు సస్పెన్షన్ వేటుకు గురై.. తిరిగి బరిలోకి దిగుతున్న రాజస్థాన్ జట్టు హైదరాబాద్ వేదికగా ఏప్రిల్ 9న తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడనుంది. ఉప్పల్‌‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఏప్రిల్‌ 9న ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌తో హైదరాబాద్‌లో ఐపీఎల్ సంబరం మొదలవుతుంది.

ఐపీఎల్ వేలానికి ముందు ఈ సీజన్‌ మ్యాచ్‌ల టైమింగ్స్ మార్చిన సంగతి తెలిసిందే. అయితే చివరకు గత సీజన్‌ మాదిరిగానే తొలి మ్యాచ్‌ 4 గంటలకు, రెండో మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు మొదలవనుంది. ఐపీఎల్ మ్యాచ్‌ వేళలను మార్చాలని ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ విజ్ఞప్తి చేయడంతో ఐపీఎల్ గవర్నింగ్ అందుకు అంగీకరించింది.

టైమ్‌ మారలేదు!: ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడబోయేది ఎవరో తెలుసా?

అయితే మ్యాచ్ వేళలను మార్పుపై మెజారిటీ ఫ్రాంచైజీలు, యాభై శాతం వాటాదారుల నుంచి వ్యతిరేకత రావడంతో పాత టైమింగ్స్‌నే కొనసాగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లన్నీ స్టార్‌ స్పోర్ట్స్‌ తన ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.


హైదరాబాద్‌లో సన్ రైజర్స్ ఆడనున్న మ్యాచ్‌ల తేదీలు:

 • ఏప్రిల్ 9: హైదరాబాద్‌లో రాజస్థాన్‌తో తొలి మ్యాచ్.
 • ఏప్రిల్ 12: హైదరాబాద్‌లో ముంబై ఇండియన్స్‌తో
 • ఏప్రిల్ 22: హైదరాబాద్‌లో చెన్నైతో
 • ఏప్రిల్ 26: హైదరాబాద్‌లో పంజాబ్‌తో
 • మే 5: హైదరాబాద్‌లో ఢిల్లీతో
 • మే 7: హైదరాబాద్‌లో బెంగళూరుతో
 • మే 19: హైదరాబాద్‌లో కోల్‌కతాతో

వేరే వేదికల్లో:

 • ఏప్రిల్ 14: కోల్‌కతా వేదికగా.. కేకేఆర్‌తో
 • ఏప్రిల్ 19: ఇండోర్ వేదికగా పంజాబ్‌తో
 • ఏప్రిల్ 24: వాంఖడేలో ముంబైతో
 • ఏప్రిల్ 29: జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో
 • మే 10: ఫిరోజ్ షా కోట్లలో ఢిల్లీతో
 • మే 13: చిదంబరం స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్‌తో
 • మే 17: చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుతో
Story first published: Thursday, February 15, 2018, 11:23 [IST]
Other articles published on Feb 15, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి