న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్యాటింగ్‌తో ధోనీ భయపెట్టాడు: విరాట్‌ కోహ్లీ

IPL 2019 : Virat Kohli Says MS Dhoni Gave Us Massive Scare || Oneindia Telugu
IPL: MS did what he does best and he gave us all a massive scare says Virat Kohli

చివరి ఓవర్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి భయపెట్టాడని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తెలిపారు. ఆదివారం రాత్రి బెంగళూరు వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాట్లాడారు.

ధోనీ భయపెట్టాడు:

ధోనీ భయపెట్టాడు:

'ఈ మ్యాచ్‌ ఎంతో ఉద్వేగంగా జరిగింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ ఇది. చివరి ఓవర్ వరకు పోరాడాం. ఈ పిచ్‌లో 160 పరుగుల స్కోరును కాపాడుకోవడం అంత సులువేం కాదు. చివరి బంతి అయితే ఎంతో ఉత్కంఠ రేపింది. 19వ ఓవర్‌ వరకూ మ్యాచ్‌ మా వైపే ఉంది. చివరి ఓవర్‌లో ధోనీ తన బ్యాటింగ్‌తో భయపెట్టాడు. ధోనీ తన ఐపీఎల్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడాడు. చివరి బంతికి నేను అనుకున్నదే జరిగింది. స్వల్ప తేడాతో విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది' అని కోహ్లీ అన్నారు.

15 పరుగులు తక్కువే చేశాం:

15 పరుగులు తక్కువే చేశాం:

'మొదటి 6 ఓవర్ల వరకు బంతి ఎ‍క్కువగా బ్యాట్‌పైకి రాలేదు. అయినా పార్థీవ్‌, డివిలియర్స్‌లు ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. మ్యాచ్‌ మధ్యలో ఈ పిచ్ పై 175 పరుగుల స్కోరు చేస్తే మంచి స్కోర్ అని భావించాం. అయితే అనుకున్న స్కోరు కంటే 15 పరుగులు తక్కువే చేశాం. చెన్నై బౌలర్లు ఫ్రంట్‌ ఫుట్‌ మీద ఆడే అవకాశం మాకు ఇవ్వలేదు. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడం అందుకు ఉదాహరణ. మొయిన్‌ అలీ, నవదీప్ సైనీ అద్భుతంగా రాణించారు' అని కోహ్లీ చెప్పుకొచ్చారు.

చివరి ఓవర్ 24 పరుగులు:

చివరి ఓవర్ 24 పరుగులు:

162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ధోనీ 84 (48 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్ధ శతకం చేసి ఒంటరి పోరాటం చేశాడు. చెన్నై విజయానికి చివరి ఓవర్‌లో 26 పరుగులు అవసరం కాగా.. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌కు వచ్చాడు. క్రీజులో ఉన్న ధోనీ వరుసగా ఐదు బంతుల్లో 4, 6, 6, 2, 6తో 24 పరుగులు చేసాడు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో ధోనీ షాట్‌ ఆడగా.. బంతి బ్యాట్ కు కనెక్ట్ అవ్వలేదు. అవతలి ఎండ్‌లో ఉన్న శార్దుల్‌ ఠాకూర్‌ పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడు. దీంతో బెంగళూరు విజయం సాధించింది.

Story first published: Monday, April 22, 2019, 16:00 [IST]
Other articles published on Apr 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X